రైతు భరోసా పై ప్రభుత్వం గుడ్ న్యూస్, ముహూర్తం - ఈ సారి వారందరికీ అమలు..!!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధుల ముహూర్తం ఖరారు చేసింది. రైతు భరోసా నిధుల కోత పైన కొంత కాలంగా జరుగుతున్న చర్చకు స్పష్టత ఇచ్చింది. ఎలాంటి కోతలు లేకుండా గత వానాకాలం సీజన్‌లో రైతు భరోసా చెల్లించిన రైతులందరి కీ యాసంగిలోనూ రైతు భరోసా పెట్టుబడి సాయం అందనుంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంటకాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ఈసారి కూడా రైతుభరోసా చెల్లించాలని సర్కారు నిర్ణయించింది. శాటిలైట్ సర్వేతో లింకు పెట్టకుండానే రైతు భరోసా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
రైతు భరోసా నిధుల జమ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే కొత్త రైతుల నమోదుకు అవకాశం కల్పించి.. ఆ వెంటనే రైతులకు నగదు బదిలీ చేయాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ లెక్కల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.8,744.13 కోట్లు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేశారు. మొత్తం 1,45,73,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లించారు.

కేవలం 9 రోజుల వ్యవధిలో సుమారు రూ.9 వేల కోట్లు రైతులకు పంపిణీ చేశారు. ఆ లెక్క ప్రకారమే యాసంగికి రైతు భరోసా చెల్లించనున్నారు. ఈనెల పదో తేదీనే భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి రూ.9 వేల కోట్ల రుణం తీసుకుంది. ఈ మొత్తాన్ని రైతు భరోసాకే కేటాయించినట్లు తెలుస్తోంది. మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 16వ తేదీతో దాదాపుగా ముగిసిపోతుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు.
గత సీజన్ లో వారికి యథాతధంగా అమలు
వాస్తవానికి సంక్రాంతికే సర్కారు రైతు భరోసా చెల్లిస్తుందని భావించారు. నిధుల సర్దుబాటు, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ నెలలోనే రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమం అవుతున్న నేపథ్యంలో కొత్త రైతుల నమోదు అంశం తెరపైకి వచ్చింది. గత వానాకాలంలో రైతుభరోసా పంపిణీ చేసిన తర్వాత.. జరిగిన భూముల క్రయవిక్రయాలు, కొత్త రైతులకు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను యాసంగికి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే.. క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు కొత్త రైతుల నమోదు, ధ్రువ పత్రాల స్వీకరణ చేపడతారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. గత ఏడాది జనవరి ఒకటో తేదీని కటాఫ్ తేదీగా తీసుకున్నారు. ఈ సారి ఏ తేదీ తీసుకుంటారనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అమలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. గత వానాకాలం మాదిరి సుమారు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
రైతులకు శుభవార్త,. వారికి వందశాతం సబ్సిడీతో సోలార్ పంప్ సెట్స్! -
దూసుకొస్తున్న కరువు, వాతావరణ శాఖ హెచ్చరిక -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications