స్థలం ఉన్నా, లేకున్నా మీకు సొంతిల్లు గ్యారెంటీ!
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు, అందులో సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం తపన పడుతున్న వారికి శుభవార్త చెప్పారు. త్వరలోనే పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం నాలుగున్నర లక్షలు ఇళ్లను నిర్మించినట్లు పేర్కొన్నారు.
పేదవారికి శుభవార్త
రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదలు లేకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని ,స్థలం లేని వారికి జీ ప్లస్ టు తరహా నివాసాలను నిర్మించి ఇస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కష్ట పడుతుందన్నారు.

అన్ని జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ప్రభుత్వ అనేక నిర్ణయాలను తీసుకుంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారు గృహప్రవేశాలు కూడా చేస్తున్నారు.
ఏప్రిల్ నుంచి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు
2025- 26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన ఇళ్లలో 53శాతం వరకు ఇప్పటివరకు పురోగతి సాధించాయి. ఇంకా 47శాతం ఇళ్ళ పనులు పూర్తి కావలసి ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా ఏప్రిల్ నుంచి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళను కేటాయిస్తున్నారు. అయితే 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,69,014ఇళ్ళను కేటాయించగా ఇందులో రెండున్నర లక్షల ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది.
ఇందిరమ్మ ఇళ్ళ నిధుల విడుదల ఇలా
మిగిలిన ఇళ్లకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 4000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నిధులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్నారు. నిధులు విడుదల అవుతున్నప్పటికీ చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇళ్ళ విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఇదే
ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇసుక కొరత ఉండడం, ఇటుక, ఐరన్, సిమెంట్ ధరలు బాగా పెరగడం కూడా దీనికి ఒక కారణమని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి అనుకునే స్థలం ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు, ఇక స్థలం లేని వారికి జి ప్లస్ 2 చొప్పున ఇళ్ళు కట్టించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
-
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
విశ్వాసం అంటే ఇది.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేస్తే 130కి.మీ వెంట నడిచిన శునకం! -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం.. పని వేళలు పొడిగింపు -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!











Click it and Unblock the Notifications