తెలంగాణ అభ్యర్థులకు గుడ్ న్యూస్: ఆ పరీక్షలు వాయిదా: మళ్లీ ఎప్పుడంటే?
Group 2 Exams in Telangana: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల విజ్ఞప్తిని..తెలంగాణ ప్రభుత్వం ఆలకించింది. దీని పట్ల సానుకూలంగా స్పందించింది. గ్రూప్ 2 పరీక్షలను అయిదు నెలల పాటు వాయిదా వేసింది. డిసెంబర్‌లో నిర్వహిస్తామని తెలిపింది.
టీఎస్‌పీఎస్సీ ఇదివరకు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సి ఉంది. మొత్తం 783 పోస్టుల కోసం గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాల్సి ఉంది ఆ రెండు తేదీల్లో. ఈ పరీక్షల కోసం దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 783 గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయడానికి ఈ ఏడాది జనవరిలో దరఖాస్తులను ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేసే ప్ర్రక్రియను కొనసాగించింది.
ఆగస్టు 7, 8 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. అదే సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడం అభ్యర్థులకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఈ రెండు పరీక్షలను ఒకేసారి రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండింటి కోసం ప్రిపేర్ కావాల్సిన పరిణామాలను అభ్యర్థులను ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో- గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలంటూ కొద్దిరోజులుగా విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌లో ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు.












Click it and Unblock the Notifications