వారికి లక్ష రూపాయలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్న తెలంగాణా ప్రభుత్వం!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోంది. అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ నిరుపేద మధ్యతరగతి ప్రజలకు మాత్రమే కాకుండా, విద్యార్థులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందాలని ప్రయత్నం చేస్తున్న యువతకు చేయూతనిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో యువత సివిల్ సర్వీసెస్ కలలు సాకారం చేసుకోవడానికి ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం
UPSC ఇంటర్వ్యూ దశకు చేరిన అభ్యర్థులకు ఆర్థిక భారం లేకుండా చేసేలా, అభ్యర్థులకు ఆర్థికంగా, అకాడమిక్ గా మద్దతునిస్తూ, ఇంటర్వ్యూలు ఫేస్ చేయడానికి సిద్ధం చేసేలా భావించిన ప్రభుత్వం UPSC సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి ఎంపికైన ప్రతి అభ్యర్థికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రోత్సాహక నగదును అందించి సహకరిస్తుంది.

సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆర్ధిక చేయూత
రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఎంపికైతే, అంతమందికి కూడా ఈ ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ స్కీమ్ ను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం అందించే ఈ ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మంచి బూస్ట్ ను ఇస్తుంది. వారిలో ఆసక్తి, విజయం సాధించాలన్న పట్టుదలను పెంచుతుంది.
50 మందికి రాజీవ్ గాంధీ అభయ హస్తం
ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంతో గత సంవత్సర 20మంది upsc ఇంటర్వ్యూ దశకు చేరుకొని ప్రోత్సాహ నగదును అందుకున్నారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య 50కి చేరింది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం, అభ్యర్థుల కోసం సీనియర్ అధికారులతో కూడిన ఒక ప్రత్యేకబోర్డు సమగ్ర మార్గనిర్దేశం చేస్తూ, వారికి డైరెక్షన్స్ ఇస్తుంది. ఢిల్లీలో ఇంటర్వ్యూ సమయంలో వసతితో పాటు పూర్తిగా సహాయ సహకారాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది.
చెక్కులు అందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈ సంవత్సరం ఇంటర్వ్యూకు అర్హత సాధించిన 50 మందికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ పథకంలో ఆర్థిక ప్రోత్సాహక చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సివిల్ సర్వెంట్స్ గా అవకాశం దక్కించుకునే వారు సమాజానికి జవాబుదారీగా ఉండాలని, ప్రస్తుతం మీరు అందుకుంటున్న ప్రోత్సాహక చెక్కులు ప్రజలు కడుతున్న పన్నులతో వచ్చినవని పేర్కొన్నారు.
ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టేలా పథకంతో సాయం
ప్రజా జీవితాన్ని మార్చగలిగే, తెలంగాణ బలాన్ని ప్రతిభను ప్రతిబింబించేలా మీ విజయం ఉండాలని అభ్యర్థులకు సూచించారు. ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రిపరేషన్ పైన దృష్టి సారించడం కోసం ఈ పథకం అందిస్తున్నామని సింగరేణి సిఎండి ఎన్ బలరాం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications