తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు!
తెలంగాణ రాష్ట్రంలో వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రభుత్వం నేడు అసెంబ్లీ వేదికగా కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అనేకమార్లు ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో, రేవంత్ రెడ్డి ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లు 2026 ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఈ బిల్లు ద్వారా వయోవృద్ధులకు రక్షణ కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో జమ
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రభుత్వ కోశాగారం నుంచి జీతాలు పొందే ఉద్యోగులతో, ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రస్తుత సమాజంలో వృద్ధులు అయినటువంటి తల్లిదండ్రులను చూడడానికి పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్న క్రమంలో, వృద్ధుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఈ సంచలన బిల్లును తీసుకువస్తోంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే పదిహేను శాతం వేతనం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ఈ నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం.

పిల్లలు చూడకుంటే నేరుగా అధికారులకు దరఖాస్తు
ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులను చూడకుండా నిర్లక్ష్యానికి గురిచేస్తారో వారి జిల్లా స్థాయిలో నియమించిన ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్ ను తమ సమస్యను చెప్పుకుంటే, దరఖాస్తు చేసుకుంటే, అధికారులు విచారణ చేసి 60 రోజులలో ఒక సమస్యను పరిష్కరిస్తారు. ఉద్యోగి వేతనం నుంచి 15% డబ్బులు లేదా పదివేల రూపాయలను, ఈ రెండింటిలో తక్కువైన మొత్తాన్ని వారికి ఇవ్వవలసిన భృతిగా నిర్ణయిస్తారు.
వయోవృద్ధుల కమిషన్ లో అప్పీలు
అంతేకాదు విచారణ అధికారి ఇచ్చిన ఆదేశాలు తృప్తిగా అనిపించకపోతే గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయిలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ప్రధాన కమిషనర్ గా వ్యవహరించే వయోవృద్ధుల కమిషన్ లో అప్పీలు చేసుకోవచ్చు దీనికి 45 రోజుల గడువు ఉంటుంది. అప్పీల్ అందిన 60 రోజులలోగా దరఖాస్తులు కమిషన్ పరిష్కరించాల్సిన నిబంధన ఇందులో చేర్చారు.
అందరిలో నైతిక బాధ్యత పెంపొందించే నిర్ణయం
తల్లిదండ్రులలో ఒకరు చనిపోతే, మరొకరి ఖాతాలో భృతి జమ చేస్తారు. ఇద్దరూ చనిపోతే సంబంధిత ఆధారాలతో ప్రత్యేక అధికారి ముందు దరఖాస్తు చేసుకుంటే, దానిని పరిశీలించి 30 రోజులలోగా తల్లిదండ్రులకు వేతనం జమ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తారు. ఇప్పటికి అనేకమార్లు తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్నారని, బాధ్యత కలిగిన ఉద్యోగులు ఈ విధంగా ప్రవర్తించ కూడదు అని అనేకమార్లు చెప్పిన రేవంత్ రెడ్డి వృద్ధులకు రక్షణకు భద్రత కల్పించడం కోసం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ప్రతి ఒక్కరిలోనూ నైతిక బాధ్యతను పెంపొందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications