హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ ఎస్బీ జాయింట్ సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ట్రాఫిక్ అదనపు సీపీగా నియమించింది. హైదరాబాద్ సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్‌ను నియమించింది.
వెస్ట్ జోన్ డీసీపీగా ఎస్‌ఎం విజయ్ కుమార్‌ను నియమించి ఆ స్థానంలో ఉన్న జోయల్ డేవిస్‌ను హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా నియమించింది.నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఆ స్థానంలో ఉన్న చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ డీసీపీగా ఎన్ శ్వేత, హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్ సుబ్బరాయుడులను నియమించింది.

ప్రస్తుతం ట్రాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న నితిక పంత్, సీసీఎస్ జాయింట్ సీపీగా ఉన్న గజరావ్ భూపాల్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి త్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో మరో ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఎన్ వెంకటేశ్వర్లు నియమించి.. ఆ స్థానంలో ఉన్న డి శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసింది. రాచకొండ రోడ్ సేఫ్టీ డీసీపీగా ఉన్న శ్రీ బాలా దేవిని బదిలీ చేసి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నియమించింది. ప్రస్తుతం మాదాపూర్ డీసీపీగా ఉన్న గోనె సందీప్‌ను రైల్వే ఎస్పీ అడ్మిన్‌గా నియమించింది. ఆ స్థానంలో ఉన్న రాఘవేందర్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పలువురు ఐపీఎస్, అధికారుల బదిలీ జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications