మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ ధరలు భారీగా తగ్గింపు: డైలీ పాస్ లకు కొత్త రేట్లు ఫిక్స్..!!

ఆర్టీసీ -మెట్రో ఉమ్మడి పాస్ ధరలు తగ్గాయి. ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయనే ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘ కసరత్తు తరువాత ఛార్జీల తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెల వారీ.. రోజు వారీ పాస్ ల ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై ప్రభుత్వం ఎట్టకేలకు తగ్గింపు నిర్ణయం తీసుకుంది. కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన కామన్ పాస్ ధరలు రోజువారీ పాస్‌కు రూ.400 కాగా, ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ వాటా రూ.100గా ఉంది. అదేవిధంగా నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500 కాగా, ఇందులో మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500గా నిర్ణయించారు. అయితే ఈ ఛార్జీలు సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పున సమీక్ష చేసిన ప్రభుత్వం ఈ ధరలను సగం వరకు తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
telangana-govt-slashes-metro-rtc-monthly-common-pass-prices-new-rates-from-november-8

ప్రయాణీకులకు బిగ్ రిలీఫ్

తగ్గించిన ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. అందులో భాగంగా మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి నెలవారీ పాస్ రూ.8,500 నుంచి రూ.4,000కు, రోజు పాస్ రూ.400 నుంచి రూ.275కు తగ్గింది. కాగా.. కొత్త నెల పాస్‌లో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, కేవలం రూ.1,000 ఆర్టీసీ బస్సులకు కేటాయించారు. అంటే పాస్ విలువలో మూడొంతులు మెట్రోకి దక్కనుంది. అదే విధంగా నెలలో 50 రౌండ్ ట్రిప్పులు పూర్తిగా వాడుకునే వారికి ఒక్కో ప్రయాణం ఖర్చు రూ.85 నుంచి సుమారు రూ.40కి తగ్గుతుంది. నెలకు రూ.4,500 ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక.. నవంబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+