ఉచిత బస్సు కొనసాగింపుగా మరో కీలక నిర్ణయం, ఇక నుంచి..!!
తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మహాలక్ష్మీ పథకం తొలుత భారమని ఆర్టీసీ భావించినా.. తరువాత ఆ పథకం కోసం ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా వస్తున్న ఆదాయం కీలకం గా మారుతోంది. దీంతో.. ఈ పథకం ఎలక్ట్రికల్ బస్సుల్లోనూ అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో పాటుగా సంస్థకు ఆదాయం మరింతగా పెంచే ఆలోచనల పైన ఫోకస్ చేసింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహాలక్ష్మీ పథకం అమలుతో పాటుగా రెవిన్యూ పెంపు పైన అధికారుల కు కీలక దిశా నిర్దేశం చేసారు.
మహాలక్ష్మీ పథకం అమలు ద్వారా ఆర్టీసీకి ఆర్దికంగా ఉపశమనం దక్కుతోంది. ప్రభుత్వం ప్రతీ నెలా ఈ పథకం అమలు రీయంబర్స్ మెంట్ నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది. ఆర్టీసీలో ఇప్పటివరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించు కున్నారు. 7980 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. దీంతో, ఈ పథకం మరింత పకడ్బందీగా అమలు దిశగా ఆర్టీసీ - ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రికల్ బస్సుల్లోనూ పథకం అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అదే విధంగా సంస్థకు ఆదాయ మార్గాల పైన అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.

ఆర్టీసీ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమీక్ష నిర్వహించారు. అందులో పలు సూచనలు చేసారు. ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు, వికారాబాద్, బీహెచ్ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్‌సుఖ్‌నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిథానితో పాటు పలు డిపోలు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications