తెలంగాణలో కొత్త పథకం: ఆ నేత పేరు: వారికి రూ. లక్ష ఆర్థికసాయం

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఓ కొత్త పథకాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. దీనికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది. నేడు శ్రీకారం చుట్టనుంది. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించబోతోన్నారు.

అదే- రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉద్దేశించిన పథకం ఇది. దీని కింద ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. నేడు ఈ పథాకన్ని రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Telangana govt to launch Rajiv Gandhi Civils Abhaya Hastham scheme today

గతంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ 1 పరీక్షలను రాయబోయే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలను రాయబోయే అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఉచిత కోచింగ్‌తో పాటు ప్రతి నెలా 5,000 రూపాయల చొప్పున మొత్తాన్ని స్టైపెండ్‌గా అందించనుంది.

హైదరాబాద్‌లో సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8, ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్‌లల్లో ఈ ఉచిత కోచింగ్ కొనసాగుతుంది. 75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ స్టడీ కాలంలో అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. దీనికి దరఖాస్తు గడువు శుక్రవారం ముగిసింది.

అదే సమయంలో ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం కొత్తగా ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి కావాల్సిన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+