రేవంత్ ప్రభుత్వం దీపావళి కానుక, మరో హామీ అమలు - మార్గదర్శకాలు..!!
తెలంగాణ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్దమైంది. ప్రతీ కుటుంబానికి రూ 5లక్షల మేర జీవిత బీమా కల్పించాలని నిర్ణయించింది. వార్షిక బడ్జెట్ లో ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయనుంది. పథకం అమలులో భాగంగా మార్గదర్శకాలు సిద్దం అయ్యాయి. ప్రతీ కుటుంబానికి ప్రయోజనం కలిగేలా ఈ పథకం పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం అందించ నుంది. ఈ పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది.
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక పథకం అమలుకు సిద్దం అయింది. దీపావళి కానుకగా ఈ పథకం అమలు ముహూర్తం ఖరారు చేసారు. ఈ నెల 19వ తేదీన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు ముహూర్తం ఖారారు చేసింది. సిద్దిపేటలో జరగనున్న బహిరంగ సభలో ఈ కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబసభ్యులకు రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతాయి. ఏ కారణంతో మరణించినా ఈ బీమా సొమ్ము అందుతుంది. ఇందుకోసం ఇన్యూరెన్స్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రేషన్ కార్డు ఉన్నవారు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించే అవసరం ఉండదు. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా గాంధీ జన్మదినం అయిన నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది.

రేషన్ కార్డు ఉన్న వారందరికీ అమలు
కాగా, ఈ పథకం అమలు కోసం నవంబర్ 20 నుండి 30 వరకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను సేకరించేలా నిర్ణయం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ బీమా సదుపాయానికి అర్హులుగా తేల్చారు. ఇందిరమ్మ కమిటీలు సేకరించిన దరఖాస్తులను ఆయా మండల తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్వీకరించి పరిశీలిస్తారు. అదే విధంగా నవంబర్ 19వ తేదీన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ రోజు నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఇందిరమ్మ చీరలు పంపించారు. పంపిణీ చేయడానికి సిద్దంగా ఉన్నాయి. దీంతో 19వ తేదీ నుంచి వీటి పంపిణీ చేపట్టేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.













Click it and Unblock the Notifications
