కార్తీక మాసం, పౌర్ణమికి అరుణాచలం వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్ - ఆంక్షలు, కీలక మార్పులు..!!

కార్తీక మాసం ఆరంభం కానుంది. పంచభూత క్షేత్రాలలో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది అరుణా చలం. కార్తీక మాసం.. అందునా కార్తీక పౌర్ణమికి ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో అత్యంత పవిత్రమైన తిరుకార్తిగై దీపోత్సవం ఘనంగా జరిగుతుంది. కార్తీక మాసంలో కృత్తిగ నక్షత్రం రోజున కొండపై వెలిగించిన ఈ మహాదీపాన్ని చూసినా లేదా ఆలోచించినా మోక్షం లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని చెబుతారు. కాగా.. ఈ సారి ఈ దీపోత్సవానికి పెద్ద సంఖ్య లో భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక మార్పులు చేయటంతో పాటుగా కొన్ని ఆంక్షలు విధించారు.

కార్తీక మాసంలో ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం
కార్తీక మాసంలో ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం

కార్తీక మాసంలో అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేకత ఉంది. అందునా ఐదు పవిత్ర స్థలాలలో మోక్ష స్థలంగా, అగ్ని స్థలంగా పరిగణించబడే తిరువణ్ణామలైలో కార్తీక మాసంలో కృత్తిగ నక్షత్రం రోజున 2668 అడుగుల ఎత్తైన పర్వత శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. తిరువణ్ణామలైలో మహాదీపం వెలిగించిన తర్వాతే ఇళ్లలో కార్తీక దీపాలను వెలిగించడం ఆచారం.

Arunachalam Karthigai Deepam Devotees Banned from Climbing the Hill temple authorities key directions

ఈ మహా దీపోత్సవంలో 5.6 అడుగుల ఎత్తు 300 కిలోల బరువు గల పాత్రలో సుమారు 3,500 లీటర్ల నెయ్యి పోసి 1,000 మీటర్ల పొడవు ఉండే కాడా వస్త్రం త్రిప్పును ఉపయోగించి ఈ మహాదీపాన్ని వెలిగిస్తారు. ఇది అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక. ఇక్కడ దీపాల కాంతి ఇళ్ళు, దేవాలయాలు, వీధులను ప్రకాశవంతం చేస్తుంది. కార్తీకదీపం సందర్భంగా అరుణాచల క్షేత్రానికి ప్రతీ ఏటా భక్తులు పోటెత్తుతారు. లక్షలాది మంది గిరిప్రదక్షిణ చేసేందుకు సిద్దం అవుతారు. దీంతో, ఈ సారి అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు.

ఆషాఢ మాసం: పెద్దలు చెప్పని రహస్యాలు, వైజ్ఞానిక నిజాలు
ఆషాఢ మాసం: పెద్దలు చెప్పని రహస్యాలు, వైజ్ఞానిక నిజాలు

నవంబర్ 24న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్తీక మహా దీపోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ వందనా గార్గ్ కొన్ని కీలక ఆంక్షలు విధించారు. మహా దీపం వెలిగించే రోజున (నవంబర్ 24) భక్తులు ఎవరూ 2,668 అడుగుల ఎత్తున్న అరుణా చల మహా కొండపైకి ఎక్కడానికి అనుమతి లేదు. రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండపై మట్టి వదులై, మార్గం ప్రమాదకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఏడాది కార్తీక దీపోత్సవానికి దాదాపు 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఆరోజున తిరువణ్ణామలైకి వస్తారు. దీంతో.. భక్తుల భద్రత కోసం కొన్ని నిర్ణయాలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్ల డించారు. అయితే, గిరి ప్రదక్షిణ యథావిధిగా కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+