గురుకుల విద్యార్థులకు తీపికబురు.. నవంబర్‌లోగా మీ కోసం..!

తెలంగాణలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు మరోసారి శుభవార్త చెప్పింది తెలంగాణా ప్రభుత్వం. వారికి అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనపై దృష్టి సారించింది. ఇప్పటికే వారికి ఆహారంతో పాటు యూనీ ఫాంలు అందిస్తున్న సర్కార్ వారికి కొత్తగా మరో తీపి కబురు చెప్పింది.

గురుకుల విద్యార్థులకు నైట్ డ్రెస్‌లు, ట్రాక్ సూట్లు, పీటీ సూట్లు నవంబర్ నెలలోగా పంపిణీ చేయనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఛైర్మన్ రవి నాయక్ స్పష్టం చేశారు. ఈ దుస్తుల నమూనాలను ఇప్పటికే పరిశీలించి ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువులు సకాలంలో చేరేలా అధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారని కూడా పేర్కొన్నారు.

Telangana Gurukul schools Students to Get Nightwear Tracksuits amp amp PT Suits by November - Official Update

రెండో జత యూనిఫాం పంపిణీ ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. అవసరమైన వస్త్రాల సేకరణ పూర్తయి, కుట్టు పనుల కోసం అందించినట్లు రవి నాయక్ వెల్లడించారు. మరో వారం రోజుల్లోగా ఈ యూనిఫాంలు విద్యార్థుల చేతుల్లోకి చేరనున్నాయి. దీంతో గురుకులాల్లో యూనిఫాం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. వైట్ యూనిఫాం సరఫరా కోసం వర్క్ ఆర్డర్ ప్రక్రియను కూడా ప్రారంభించారు.

ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వాటిని కూడా విద్యార్థులకు అందజేస్తామని ఆయన చెప్పారు. యూనిఫాంల సరఫరాలో ఎలాంటి లోటు రాకుండా సాధారణ అవసరానికి మించి 10 శాతం అదనంగా దుస్తులను సమీకరించినట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్యలో మార్పులు లేదా అనుకోని అవసరాలు తలెత్తినప్పుడు ఈ అదనపు నిల్వలు ఉపయోగపడతాయని వివరించారు.

నాణ్యత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ లేదని రవి నాయక్ స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ లు సరఫరా చేసిన దుస్తులు లేదా ఇతర వస్తువుల్లో నాణ్యతా లోపాలు కనిపిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే సమయంలో ఎడ్యుకేషన్ కిట్ల సరఫరాపైనా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. వాటి పంపిణీ పురోగతిని కూడా నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు.

ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంపై కీలక ఆదేశాలిచ్చిన మంత్రి పొంగులేటి!
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంపై కీలక ఆదేశాలిచ్చిన మంత్రి పొంగులేటి!

తెలంగాణలో సంక్షేమ గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ఉచిత వసతి, భోజనం, యూనిఫాం, పుస్తకాలు, ఇతర సామగ్రితో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు, రాత్రి దుస్తులు సకాలంలో అందడం వల్ల వారి రోజువారీ కార్యకలాపాలు, ఆటలు, వ్యాయామాలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+