వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిదే: తెలంగాణలో గుండె జబ్బులతో మరణాలెక్కువ, మహిళలే టాప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుండెపోటు.. గతంలో ఇది చాలా అరుదుగా విన్పించేది. టెక్నాలజీ పెరిగిన తర్వాత గుండెపోటుకు గురై మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో గుండెపోటు‌తో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని నివేదికలు చెబుత్తున్నాయి.ఇందులో హైద్రాబాద్ నగరం హర్ట్ ఎటాక్ కారణంగా చనిపోయే రోగుల్లో అగ్రస్థానంలో ఉంది.

హైద్రాబాద్‌లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. సినీ నటి శ్రీదేవి మరణంతో మరో సారి గుండెపోటు అంశం చర్చనీయాంశంగా మారింది. మారిన పరిస్థితుల కారణంగా ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో గుండెపోటు వయస్సు మీరినవారికి ఎక్కువగా వచ్చేది. కానీ, ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండానే గుండెపోటు సంభవిస్తున్నాయి. గుండెపోటుతో చిన్న వయస్సులోనే చనిపోయిన వారు కూడ ఉన్నారు.

టెక్నాజీ పెరిగినా, ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిన సమయంలో కూడ ఈ తరహ మరణాలు సంభవించడం కొంత ఆలోచించాల్సిన అంశంగా నిపుణులు భావిస్తున్నారు.

హైద్రాబాద్‌లోనే గుండెపోటు మరణాలెక్కువ

హైద్రాబాద్‌లోనే గుండెపోటు మరణాలెక్కువ

గుండెపోటుతో మరణించే వారి సంఖ్య హైద్రాబాద్‌లో ఎక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి.ఈ లెక్కల ప్రకారంగా ఒక్క హైద్రాబాద్‌లోనే ప్రతి ఏటా 8 నుండి 10 వేల మందికి ఓపెన్ హర్ట్ సర్జరీలు జరుగుతున్నాయి. మారుతున్న జీవనశైలితో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో జీవిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, ధూమ, మద్యపానం, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల తక్కువ వయసులోనే గుండె జబ్బులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే సకాలంలో వైద్యుడి వద్దకు వెళ్ళని కారణంగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

40 ఏల్ళలోపువారు గుండె జబ్బు బారనపడుతున్నారు

40 ఏల్ళలోపువారు గుండె జబ్బు బారనపడుతున్నారు

హైద్రాబాద్ నగరంలో యువత అత్యధికంగా గుండె జబ్బుల బారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. ఎంతో కీలకమైన 25-40 వయసులోనే హృద్రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే 80 శాతం గుండె వ్యాధులను నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మహిళల్లో ఎక్కువగా గుండె జబ్బులు

మహిళల్లో ఎక్కువగా గుండె జబ్బులు

గుండె సమస్యలతో వస్తున్న వారిలో మహిళలు అధిక శాతం మంది ఉంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గుండు జబ్బుల కారణంగానే ఎక్కువ మంది మహిళలు మరణిస్తున్నారని అధ్యయనంలో తేలింది. నగరంలో మహిళల్లో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో పురుషులు, మహిళలు దాదాపు సరిసమానంగా ఉంటున్నారని రిపోర్ట్‌లు చెబుతున్నాయి.

ఆ రెండు గంటలే కీలకం

ఆ రెండు గంటలే కీలకం

గుండె నొప్పి వచ్చిన తర్వాత 2 గంటలు చాలా కీలకమైనవని వైద్యులు చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఫోన్‌ చేసిన వెంటనే అంబులెన్సును వస్తుంది. లక్షణాలను బట్టి నేరుగా బాధితులను క్యాథ్‌ల్యాబ్‌కే తరలించి చికిత్స అందిస్తారు. మన వద్ద అత్యవసర విభాగం నుంచి మెడిసిన్‌ అక్కడ నుంచి కార్డియాలజీలో వైద్యులు చూసిన తర్వాత క్యాథ్‌ల్యాబ్‌కు తరలించడం వల్ల సమయం వృథా అవుతోందని నిపుణులు చెబున్నారు. గుండెపోటు వచ్చిన వారికి వెంటనే వైద్య చికిత్స అందిస్తే మృత్యువు ముఖం నుండి బయటపడతారని చెబుతారు.

English summary
Telangana has the highest number of people dying due to heart diseases in the country, according to data on causes of death released by by the census of India. The data pertaining to 2014 and says that 57.1 per cent of all medically certified deaths in Telangana happened due to ‘diseases of circulatory system’, which is also the cause for most of the deaths in the country 31.6 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X