వివాహమైన కూతుర్లు కూడా కారుణ్య నియామకాలకు అర్హులే!

వివాహం అయినంత మాత్రాన కూతురికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం నిరాకరించడం తీవ్ర వివక్షతో కూడుకున్నదని.. అది రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేవలం పెళ్లయిన మహిళ అనే కారణంతో దరఖాస్తును తిరస్కరించడం ఎంత మాత్రం చెల్లదని స్పష్టం చేస్తూ.. బాధితురాలికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్)ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో గడిచిన 12 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది.

తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చెయ్యాల్సిందే.. స్పష్టమైన ఆదేశాలు!
తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చెయ్యాల్సిందే.. స్పష్టమైన ఆదేశాలు!

12 ఏళ్ల నాటి ఘటన
నల్గొండ జిల్లాకు చెందిన కుంబం జ్యోతి తండ్రి కె.రామకృష్ణారెడ్డి సదరన్ డిస్కమ్‌లో అసిస్టెంట్ లైన్ మ్యాన్‌గా పనిచేస్తూ జూన్ 4, 2014న హఠాన్మరణం చెందారు. ఆయన మరణానంతరం కుటుంబంలో సంపాదించే దిక్కు లేకపోవడంతో పాటు తన భర్త కూడా నిరుద్యోగేనని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని జ్యోతి దరఖాస్తు చేసుకున్నారు. అయితే వివాహిత అయిన కూతురికి కారుణ్య నియామక నిబంధనల ప్రకారం అర్హత లేదంటూ డిస్కమ్ యాజమాన్యం ఆమె దరఖాస్తును తిరస్కరించింది.

Telangana High Court Key Verdict Married Daughters Eligible for Compassionate Appointment Full Details

డిస్కమ్ నిరాకరణను సవాలు చేస్తూ జ్యోతి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ సుదీర్ఘ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా జ్యోతి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ.. ఉద్యోగ అవకాశాల కల్పనలో కుమారుడు, కూతురు మధ్య వివక్ష చూపడం రాజ్యాంగ సమ్మతం కాదని వాదించారు. కాగా కారుణ్య నియామకం అనేది ప్రాథమిక హక్కుగా కోరలేరని, ఇది కేవలం సంస్థ నిబంధనలు, ఖాళీల లభ్యతకు లోబడి ఉంటుందని డిస్కమ్ తరఫు న్యాయవాది తమ వాదనలను వినిపించారు.

Cyclone Arnab: అర్నాబ్ ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు!
Cyclone Arnab: అర్నాబ్ ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు!

ఉద్యోగం ఇవ్వాలని కోర్టు ఆదేశం
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అర్హత కలిగిన మహిళా అభ్యర్థిని కేవలం వివాహమైందనే ఒకే ఒక్క కారణంతో ఉద్యోగ సెలెక్షన్ ప్రక్రియ నుంచి మినహాయించడం సరైంది కాదని స్పష్టం చేశారు. పిటిషనర్ విజ్ఞప్తిని అనుమతిస్తూ.. కుంబం జ్యోతికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం మంజూరు చేస్తూ తక్షణమే అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ దక్షిణ డిస్కమ్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+