Telangana: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు తేలికపాటి వర్షాలు..!
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అయితే వచ్చే మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలిపాటి వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు రోజులు వేడి. తేమతో కూడిన పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలిపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శుక్రవారం పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా పెద్దపల్లి, నల్గొండలో 45.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, వనపర్తి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు అధిక ఉష్ణోగ్రతల హెచ్చరిక జారీ చేశారు. అవి రెడ్ కేటగిరీలో ఉన్నాయి.

హైదరాబాద్ లో కూడా అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత చందానగర్‌లో నమోదైంది. GHMC పరిధిలోని అన్ని ప్రాంతాలు 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఐదు రోజుల్లో మొత్తం 33 జిల్లాల్లో 41-44 డిగ్రీల సెల్సియస్‌లో ఉండే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అలాగే నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, సూర్యాపేట జిల్లాలతో పాటు సమీప ప్రాంతాలకు తీవ్ర వేడిగాలుల హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర, తమిళనాడు తీరప్రాంతం, మధ్యప్రదేశ్, కర్ణాటకలోని దక్షిణ అంతర్భాగాల్లో పలు తుఫానుల కారణంగా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.












Click it and Unblock the Notifications