హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని దేశ ఐటీ రాజధానిగా మారుస్తామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బెంగళూరులో తెలంగాణ ఐటీశాఖ నిర్వహించిన ఐటీ రోడ్ షో కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వర్గాలతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు.

తెలంగాణలోని అత్యుత్తమ విద్యా, మౌళిక సదుపాయాలతో బహుళజాతి కంపెనీలకు, ఐటీ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశోధనలకు ముందుకురావాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల వర్గాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

బెంగుళూరులోని హోటల్ మారియట్‌లో జరిగిన కార్యక్రమంలో భారీగా హజరైన పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులను హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిప్పటి నుంచి ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, హైదరాబాద్ నగరంలోని సౌకర్యాలను మంత్రి పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఐటీలో ప్రస్తుతం ఉన్న 3.25 లక్షల ఉద్యోగులను పది లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్

మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, డెల్, మోటరోలా, డెలాయిట్, కన్వర్‌జీస్, యూబీఎస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ, హనీవెల్, సిమెన్స్, జేపీ మోర్గాన్, యూనైటెడ్ హెల్త్ గ్రూప్, ఫేస్‌బుక్ వంటి ఫార్చ్యున్ 500 జాబితాలోని కంపెనీలు అత్యధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని కేటీఆర్ తెలిపారు.

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్


దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, ఐగేట్ సొనాటా, ఇన్ఫోటెక్ కంపెనీలు సైతం హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు.

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్


దేశంలో ఎక్కడికైనా రెండు గంటల్లో వెళ్లే వీలుండటం హైదరాబాద్‌కున్న ప్రత్యేకత అని వివరించారు. నగరంలోని మౌళిక వసతులపై ఖర్చు ఇతర నగరాలతో పోలిస్తే చాలా తక్కువ ఉందని పారిశ్రామికవేత్తలకు మంత్రి గుర్తుచేశారు.

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరిశ్రమ అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధికి ఇంజిన్‌గా గుర్తించిందని, ఉద్యోగాల కల్పనరంగంగా దీనిని గుర్తించి పరిశ్రమ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్

ఐటీ ఉత్పత్తులను పెంచేందుకు రూ.2,19,440 కోట్లతో 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.580 కోట్ల అంచనా వ్యయంతో 602 ఎకరాల్లో ఈ-సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్

దేశ ఐటీ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్

మహేశ్వరంలో రూ.360 కోట్ల పెట్టుబడితో 310 ఎకరాల్లో చేపట్టే ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్‌లో 35 వేల మందికి ప్రత్యక్షంగా, 2.1లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను పోత్సహించేందుకు దేశంలోనే 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత పెద్దదైన టీ-హబ్ ఇంక్యుబేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

English summary
Telangana IT Minister KTR Road Show in Bangalore to Promote Hyderabad's IT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X