మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాబ్ మేళా: 200మందికి ఉద్యోగాలు..

మంగళశారంఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగిన ఈ జాబ్ మేళాలో..లాజిస్టిక్స్, రిటెయిల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టారు.

|
Google Oneindia TeluguNews

మంచిర్యాల: ప్రధానమంత్రి కౌశల్ & రోజ్ గారి యోజన కింద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జాగృతి బ్రాంచ్ లలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్ సహా 15 పట్టణాలలో జులై 4 నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహించనున్నారు. తొలుత మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయంలో జులై 4న ఈ జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభమైంది.

స్కిల్ సెట్ సంస్థ బాసిత్ గారి నిర్వహణలో తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఎల్.ప్రేమ్ రావు గారి అధ్యక్షతన జరిగిన ఈ జాబ్ మేళాలో దాదాపు 800మంది నిరుద్యోగ యువత పాల్గొనగా.. వారిలో 200మందికి ఉద్యోగాలు కల్పించారు.

మంగళశారంఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగిన ఈ జాబ్ మేళాలో..లాజిస్టిక్స్, రిటెయిల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టారు. వీటితో పాటు బీపీఓ, ఎలక్ట్రానిక్స్, అగ్రిబేస్డ్ కంపెనీలు, ఫార్మసీ సంస్థలు, హోటల్ పరిశ్రమ, బ్యూటీ అండ్ వెల్నెస్, సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు కూడా పలువురు అభ్యర్థులను రిక్రూట్ చేసుకున్నాయి.

జాబ్ మేళా గురించి తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా కన్వీనర్ ప్రేమ్ రావు మాట్లాడుతూ.. గతంలో 100మందికి ఉద్యోగాలు కల్పించామని, ఇప్పటికీ ట్రైయినింగ్ సెంటర్ల నిర్వహణ జరుగుతున్నందున నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శిక్షణ శిబిరాల్లో పాల్గొన్నవారికే కాకుండా అర్హత కలిగిన ఇతర నిరుద్యోగ యువతకు కూడా జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పించినట్లు వారు తెలిపారు. జాబ్ మేళా కోసం జాగృతి నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాను దత్తత తీసుకోవడం కూడా జరిగిందని తెలియజేశారు. సంపూర్ణ అక్షరాస్యత దిశగా ఈ ప్రయత్నాలు సఫలమవుతాయని ఆకాంక్షించారు.

కాగా, కార్యక్రమంలో అత్తిలి సరోజ(శిశు సంక్షేమ శాఖ నామినేటెడ్), వసుంధర(జిల్లా ఛైర్ పర్సన్) తదితరులు పాల్గొన్నారు.
జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాలకు కోసం హైదరాబాద్ దోమలగూడలోని నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రధాన కార్యాలయంలోని 040-40214215 నంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

English summary
Telangana Jagruti Job Mela 2017 Walkin Interview From July 4 To August 25 tjskills.org: Telangana Jagruthi Skill Development Centre very recently announced for Telangana Jagruti Job Mela 2017 all across the state including Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X