మహిళా ఏఎన్ఎం సాహసం: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం నడుంలోతు నీటిలో..(వీడియో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. బూస్టర్ డోసులను కూడా అందిస్తోంది. తాజాగా, ఓ ఏఎన్ఎం కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ఓ మారుమూల గ్రామానికి వెళ్లేందుకు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది.
వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ పీహెచ్‌సీలో కుదురుముల్ల వద్ద ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం ఆరోగ్య కార్యకర్త నడుములోతు పారుతున్న కాలువను దాటారు. విధి నిర్వహణలో ఆమె చూపిన ధైర్యసాహసాలకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఆమెను అభినందిస్తూ ఓ ట్వీట్ చేసింది.

'మా అంకితభావంతో ఆరోగ్య కార్యకర్తలు అడ్డంకులను దాటి ప్రజల కోసం పనిచేస్తున్నారు. వికారాబాద్ జిల్లా, దౌలతాబాద్ PHCలోని కుదురుముల్ల వద్ద, #Covid19 వ్యాక్సినేషన్‌ను తన పనిని చేయడానికి మార్గంలో భారీ నీటి మార్గాన్ని దాటి ప్రయాణించే ప్రయత్నాలను అభినందిస్తున్నాము' అని పేర్కొంది.
Our dedicated Health workers look beyond obstacles and working for the people. Appreciate the efforts of ANM traversing through water, at Kudurumulla, of Doulathabad PHC, Vikarabad district on her way to do her job of administering #Covid19 vaccination. pic.twitter.com/PhrAQNoizP
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) July 27, 2022
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు 500 లోపే నమోదైన కరోనా కేసులు ఇప్పుడు 700 దాటుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ వేగం పెంచింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బూస్టర్ డోసు ప్రారంభించడంతో తెలంగాణలోనూ వేగంగా వ్యాక్సినేషన్ చేపడుతున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications