హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఐటీ విద్యార్థిని అంజలి ఉన్నత చదువుకి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. తమకు సాయం చేయాలంటూ వస్తున్న విజ్ఞప్తులపై వెంటనే స్పందిస్తూ వారికి సాయం అందిస్తుంటారు. తాజాగా, ఓ ఐఐటీ విద్యార్థినికి ఉన్నత చదువుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా హసన్‌ప‌ర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి. రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే కుటుంబ పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా మంత్రి కేటిఆర్‌ను కోరింది.

 Telangana minister ktr financial assistance to IIT student anjali for her education

మేకల అంజలి పేదరిక పరిస్థితులను తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆమె ఫీజులకు అవసరమైన నిధులను అందిస్తూ వస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది, రానున్న సంవత్సరానికి సంబంధించిన ఐఐటీ ఫీజుల మొత్తాన్ని బుధ‌వారం అంజలి కుటుంబానికి మంత్రి అందించారు.

ఈ సందర్భంగా అంజలి చదువు, భవిష్యత్ ప్రణాళికల గురించి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. తమ కూతురు ఐఐటీ విద్యకు సంబంధించిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం మంత్రి కేటీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థిని అంజలి, ఆమె కుటుంబసభ్యులతో మంత్రి కేటీఆర్ కాసేపు ముచ్చటించారు.

ప్రశాంతంగా ముగిసిన ఎడ్‌సెట్ పరీక్షలు

Recommended Video

eport on trs mlas Fired on Revanth Reddy | Oneindia Telugu

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్‌ - 2021 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ఈ పరీక్షను రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి 54 కేంద్రాల్లో నిర్వహించినట్లు ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎ. రామకృష్ణ తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 42,399 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 34,185 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. మొత్తమ్మీద హాజరుశాతం 80.5 శాతంగా నమోదైందని వివరించారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఆగస్టు 29వ తేదీన విడుదల చేస్తామన్నారు.

English summary
Telangana minister ktr financial assistance to IIT student anjali for her education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X