హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్: ప్రారంభించిన కేటీఆర్: 132 లింక్ రోడ్ల అభివృద్ధి: ఇస్తాంబుల్‌తో
హైదరాబాద్: భాగ్యనగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఆరు లేన్లుగా నిర్మించిన షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి కిందటే ప్రారంభించారు. మొట్టమొదటి ఆరు లేన్ల ఫ్లైఓవర్ ఇది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రూ.333 కోట్ల వ్యయంతో..
దాదాపు 333.55 కోట్ల రూపాయలతో వ్యయంతో దీన్ని నిర్మించింది కేసీఆర్ సర్కార్. దీని పొడవు 2.71 కిలోమీటర్లు. వెడల్పు సుమారు 24 మీటర్లు. ఆరు లేన్లుగా..రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించడానికి వీలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీన్ని డిజైన్ చేశారు. ఈ షేక్‌పేట్ ఫ్లైఓవర్ నాలుగు జంక్షన్ల మీదుగా సాగుతుంది. షేక్‌పేట్, ఫిల్మ్‌నగర్, ఉస్మానియా యూనివర్శిటీ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్‌లను మీదుగా ప్రయాణం సాగించడానికి వీలుగా ఫ్లైఓవర్ నిర్మించారు.

కొద్దిరోజుల కిందటే ఒవైసీ ఫ్లైఓవర్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ప్రభుత్వం ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. మిధాని, ఒవైసీ జంక్షన్ వద్ద 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫ్లైవర్‌ను ఇటీవలే కేటీఆర్ ప్రారంభించారు. క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ పానెల్స్ లాంటి పనులకు ఆర్‌సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. దీనికి దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును పెట్టింది జీహెచ్ఎంసీ. అంతకుముందు బాలానగర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది.
ఆరు వేల కోట్ల రూపాయలతో..
ఏడున్నర సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఇప్పటిదాకా 6,000 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించామని చెప్పారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 11, జనాభాలో 12వ స్థానంలో ఉందని, దానికి అనుగుణంగా జీడీపీకి వాటాలను అందించడంలో నాలుగో స్థానంలో నిలిచిందని అన్నారు.

132 లింక్ రోడ్ల అభివృద్ది..
హైదరాబాద్‌లో ఎటు నుంచి ఎటు వెళ్లడానికైనా వీలుగా లింకు రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనికోసం భవిష్యత్తులో వేల కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నామని అన్నారు. దీనితోపాటు కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ కింద నగర పరిధిలోని 793 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ది చేస్తామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 100 కోట్ల రూపాయల వ్యయంతో లైట్లను అమర్చామని గుర్తు చేశారు.

కంటోన్మెంట్ కోసం ప్రత్యేక దృష్టి..
కంటోన్మెంట్‌లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంపై దృష్టి సారించాలని జీ కిషన్ రెడ్డిని కోరారు. దీనిపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడి అనుమతులను ఇప్పించాలని సూచించారు. మూసివేసిన రహదారులను తెరిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
టర్కీలోని ఇస్తాంబుల్ నగరానికి ధీటుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని తాము సంకల్పించామని కేటీఆర్ అన్నారు. ప్రపంచ వారసత్వ సంపద, చారిత్రక కట్టడాల్లో ఇస్తాంబుల్‌కు హైదరాబాద్ ఏ మాత్రం తీసిపోదని చెప్పారు. యునెస్కో నుంచి వారసత్వ నగరంగా గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications