అభ్యంతరాలేంటో ఏపీ స్పష్టం చేయాలి - 6 రేట్లు అధికంగా వృద్ధి : అమిత్ షా సమక్షంలో మహమూద్ అలీ..!!
తెలంగాణకు కేటాయించిన కృష్ణా జలాలను వినియోగించుకునే విధంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని కేంద్ర హోం మంత్రి సమక్షంలోనే తెలంగాణ రాష్ట్రం స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో తెలంగాణ మంత్రి మహమూద్ అలీ.. అధికారులు పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు సంబంధించి రూ.6,015 కోట్లు విద్యుత్తు బకాయి, ఏపీ జెన్‌కో ద్వారా టీఎస్ డిస్కమ్‌లకు సరఫరా చేసిన విద్యుత్తు కోసం టీఎస్ డిస్కమ్‌లు రూ.1,442కోట్లు చెల్లింపులు జరపాల్సి ఉందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభం
అలాగే తెలంగాణకు ఏపీ నుంచి రూ.4,457 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీనికి సమావేశం.. మరోసారి ఇరు రాష్ట్రాలు సమావేశమై పరిష్కరించుకోవాలని సూచించింది. హైకోర్టులో ఉన్న కేసులు, ఇతర సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ సుముఖంగా ఉందని అధికారులు పేర్కొనగా.. ఇరు రాష్ట్రాలు చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని సమావేశం తీర్మానించింది.
తెలంగాణకు కేటాయించిన కృష్ణా జలాలను వినియోగించుకునే విధంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని, పాలమూరు-రంగారెడ్డి, నక్కల గండి ఎల్‌ఐఎస్ ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించినట్లు తెలంగాణ తరఫున అధికారులు వెల్లడించారు.

అభ్యంతరాలేంటో చెప్పాలి
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి చర్యలు, నివేదికలతో పాటు కొత్త అంశాలను ఇందులో చేర్చారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్(ఎల్‌ఐఎస్) నక్కలబండ ఎల్‌ఐఎ్‌సలకు సంబంధించి జనవరి 21న డీపీఆర్‌లు సమర్పిస్తామని అధికారులు తెలిపారు.
బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం రాష్ట్రానికి కేటాయించిన మిగులు జలాల ద్వారానే నీటిని వినియోగిస్తున్నందున కర్ణాటక రాష్ట్రానికి ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అభ్యంతరాలను వెంటనే పరిశీలించి తమ అభిప్రాయాలను ఏపీ చెప్పాలి. ఢిల్లీ ఏపీ భవన్ విభజన ప్రతిపాదనలు పరిశీలించి కేంద్రం స్పీడ్ గా పరిష్కరించాలని మహమూద్ అలీ స్పష్టం చేసారు.
Recommended Video

తెలంగాణలో అధికంగా వృద్ధి
వ్యవసాయ వృద్ధి, రైతుల ఆదాయం పెంచడం లో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.. రైతు బంధు పథకం అమలు చేస్తున్నాం... 24 గంటల కరెంట్ ఇస్తున్నాం.. ప్రాథమిక రంగం జాతీయ వృద్ధి తో పోలిస్తే తెలంగాణ 6 రేట్లు అధికంగా వృద్ధి సాధించిందన్నారు. మహిళలు, పిల్లల పై నేరాలు జరగకుండా పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేశామని వివరించారు.
షీ టీమ్స్ ఏర్పాటు చేశామని హోంమంత్రి సమావేశంలో వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య వున్న అనేక సమస్యలను విభజన చట్టం ప్రకారం పరిష్కరించుకున్నాం... మిగిలిన సమస్యలను కూడా రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యం గా పరిష్కరించుకుంటాం..కరోనా కాలం లో ప్రాణ నష్టం, జీవనోపాధి దెబ్బ తిన కుండా చూశాం. పేదల ఆరోగ్యం కోసం పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications