ఏపీ సీఎంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి..జగన్‌తో అలాంటి బంధమే

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆ పార్టీ నుంచి ఎంపీగా కూడా పనిచేశారు. తాజాగా కాంగ్రెస్‌లో చేరి.. అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. తనకు, వైఎస్‌ జగన్‌ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు అని పొంగులేటి స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి విజయవాడ వెళ్లి దుర్గమ్మను దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొక్కు చెల్లించుకోవడానికి దుర్గమ్మ దగ్గరకు వచ్చినట్లు చెప్పారు.

ఇక, అభివృద్ధి పేరుతో కేసీఆర్‌ 10 సంవత్సరాల కాలంలో అనేక అప్పులు చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఆకాంక్షలను కేసీఆర్‌ నెరవేర్చలేదని మండిపడ్డారు. ధనిక తెలంగాణను కేసీఆర్‌ పదేళ్ల పాలనలో 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. తనకు, ఏపీ సీఎం జగన్ కు ఉన్న వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ సంబంధాలు వేర్వేరని చెప్పారు.

telangana minister ponguleti srinivasa reddy comments on ap cm ys jaganmohan reddy

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమన్వయంతో విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తామని, రెండు రాష్ట్రాల మధ్య ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని, ఏపీ, తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+