రూ. 9,000 కోట్ల టోల్ ట్యాక్సులు కట్టాం- ఆ నిధులు ఏమయ్యాయ్: కేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ

హైదరాబాద్: ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా ఛార్జీలు పెరగనున్నాయి. వాటిని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల నుంచి పెరిగిన టోల్ ట్యాక్సులు అమలులోకి రానున్నాయి. దీన్ని తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేస్తోంది. ఈ పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో వేల కోట్ల రూపాయల మేర టోల్ ట్యాక్సులను కట్టామని గుర్తు చేసింది.

ఈ మేరకు రహదారులు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారాయన ఇందులో. ఏప్రిల్ 1 నుంచి టోల్ రేట్లను పెంచాలంటూ జాతీయ రహదారుల సంస్థ రూపొందించిన ప్రతిపాదనలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వెంటనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Toll Plaza

నేషనల్ హైవే అథారిటీ ద్వారా వసూలు చేస్తోన్న టోల్ ట్యాక్సులు.. ఇప్పటికే తమ రాష్ట్ర ప్రజలకు పెను భారంగా పరిణమించిందని అన్నారు. ఇప్పుడు మళ్లీ వాటిని పెంచినట్లయితే, అది మరింత కుంగదీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 32 టోల్ గేట్ల ద్వారా తొమ్మిది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం అక్షరాలా 9,000 కోట్లకు పైగా ట్యాక్సులను వసూలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో సగం మొత్తాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజల నుంచి టోల్ ట్యాక్స్ రూపంలో వసూలు చేశారని అన్నారు.

Vemula Prashant Reddy

రాష్ట్రంలో 113 జాతీయ రహదారుల ప్రాజెక్టులు, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పనుల కోసం ఈ తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం 1,25,176 కోట్ల రూపాయలను మంజూరు చేసినప్పటికీ, ఇప్పటివరకు 20,350 కోట్ల రూపాయలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ 20,350 కోట్ల రూపాయల్లో సగం మొత్తం అంటే 9,000 కోట్ల రూపాయలకు పైగా తెలంగాన ప్రజలు టోల్ ట్యాక్స్ రూపంలో చెల్లించారని వివరించారు.

Nitin Gadkari

తెలంగాణ ప్రజల నుంచి కేంద్రం పెట్రోలు, డీజిల్‌పైనా సెస్‌ విధించిందని, దీని ద్వారా కోట్లాది రూపాయలను వసూలు చేస్తోందని అన్నారు. ఆ మొత్తాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వినియోగించట్లేదని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై అదనపు సెస్ రూపంలో వసూలు చేస్తోన్న కోట్లాది రూపాయలు ఎటు పోతున్నాయో తెలంగాణ ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అటు టోల్ ట్యాక్సులు, ఇటు పెట్రోల్, డీజిల్ పై సెస్ లు వసూలు చేస్తూ సామాన్యులను కేంద్రం అరిగోస పెడుతోందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+