తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపులు వీటికే..నిబంధనలు ఉల్లంఘిస్తే ఉక్కుపాదమే !!
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్ ఈరోజు రాత్రి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పేర్కొన్న సర్కార్ పౌరులందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేసింది. ఇక నైట్ కర్ఫ్యూ సందర్భంగా కర్ఫ్యూ పరిధిలోకి ఏమేం వస్తాయి.. కర్ఫ్యూ నుండి నుంచి వేటికి మినహాయింపు అన్న విషయానికి వస్తే..

రాత్రి 8 తర్వాత వీటికి నో పర్మిషన్ , అత్యవసరాలకు మినహాయింపు
పౌరులు బయట తిరగడానికి, రాత్రి 8 గంటల తర్వాత దుకాణాలు, బార్లు, క్లబ్బులు ,పబ్బులు, రెస్టారెంట్లు నిర్వహించటానికి నో పర్మిషన్ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. 8 గంటల లోపే పైన పేర్కొన్న అన్ని బంద్ చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. టెలీ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలకు, అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. పెట్రోల్ బంకులు , ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ,మెడికల్ షాపులు ,ల్యాబ్ లకు, మీడియాకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది.

వీటికి కూడా నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు
రాష్ట్రాల మధ్య ప్రయాణాలు, సరుకు రవాణా వాహనాలు, వైద్యం కోసం వెళ్లి గర్భిణీలు, రోగులకు మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ అధికారుల రాకపోకలకు మినహాయింపు ఇచ్చింది . ఐ టి తో పాటు ఐటి అనుబంధ సేవలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. కోల్డ్ స్టోరేజ్ లు , గోడౌన్ లు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. ఈ కామర్స్ యాప్ ద్వారా జరిగే ఆహారపదార్థాల పంపిణీకి మినహాయింపులు ఇచ్చింది . నీటి సరఫరా పారిశుద్ధ్య పనులకూ, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులకు మినహాయింపు ఇచ్చింది.

ఈ కర్ఫ్యూ నిబంధనలు ఈ రోజు రాత్రి నుండి ఏప్రిల్ 30 వరకు అమల్లో
ఎయిర్ పోర్టు రైల్వేస్టేషన్లో బస్టాండ్లో నుండి ఇళ్లకు చేరుకునే ప్రయాణికులకు మినహాయింపులు ఇచ్చింది. ఎల్పిజి, సిఎన్జి తోపాటు గ్యాస్ పంపు లకు మినహాయింపు ఇచ్చింది. బ్రాడ్కాస్టింగ్ మరియు కేబుల్ సేవలకు మినహాయింపునిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక ఈ కర్ఫ్యూ నిబంధనలు ఈ రోజు రాత్రి నుండి ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనున్నాయి . ఇదే సమయంలో ప్రధాన సామాజిక బాధ్యతతో ఇంట్లోనే ఉండాలని నైట్ కర్ఫ్యూ నుండి ఐటీ కంపెనీలకు అనుమతించినట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 188 ప్రకారం కేసులు
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేశారు . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అనవసరంగా బయట తిరగొద్దని చెప్తున్నారు . ఇక కర్ఫ్యూ సమయంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు వర్తిస్తుందని సీపీ సజ్జనార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 188 ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications