• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేత‌ల‌ను ఉతికేస్తున్న తెలంగాణ ప్ర‌జ‌లు..! మొన్న గులాబీ., నిన్న కాంగ్రెస్ నాయ‌కుల నిల‌దీత‌..!!

|

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌జ‌లు విజ్ఞ‌త‌గా వ్య‌వ‌మ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఓట్ల కోసం త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నాయ‌కుల ప‌ట్ల అతి విన‌యం ప్ర‌ద‌ర్శించ‌కుండా చేసిన ప‌నుల ప‌ట్ల నిర్మొహమాటంగా నిల‌దీస్తున్నారు. అది అదికార పార్టీ నేత‌లైనా, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌లైనా లెక్క చేయ‌కుండా వారు అడ‌గాల్సిన పాయింట్ ను అడిగి నాయ‌కుల‌ను నిల‌దీస్తున్నారు. అదికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌నైతే కొన్ని చోట్ల గ్రామ బ‌హిష్క‌ర‌ణ చేస్తున్నారు. ప్ర‌జ‌ల్లో ఒచ్చిన చైత‌న్యాన్ని చూసి ప్ర‌జాప్ర‌తినిధిలు అవాక్క‌వుతున్నారు. నిన్న‌టికి నిన్ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత జానారెడ్డి కూడా ప్ర‌జాక్షేత్రంలో చేదుఅనుభ‌వాన్ని ఎదుర్కొవాల్సివ‌చ్చింది.

ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను నిల‌దీస్తున్న ప్రజ‌లు..! మంచి మార్పు అంటున్న విశ్లేష‌కులు..!!

ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను నిల‌దీస్తున్న ప్రజ‌లు..! మంచి మార్పు అంటున్న విశ్లేష‌కులు..!!

ఎన్నికలకు సమయం దగ్గరపడినందన రాష్ట్రంలోని పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీని రద్దు చేసిన రోజే అభ్యర్థులను ప్రకటించడంతో వాళ్లంతా ప్రచారం రెండు నెలల క్రితమే ప్రారంభించేశారు. కొందరైతే మొదటి దశ కూడా పూర్తి చేసేశారు. రాష్ట్రంలోని పలు పార్టీలకు చెందిన అభ్యర్థుల ప్రచారం కూడా మొదలైపోయింది.

అదికార పార్టీ నేత‌ల‌కు సెగ‌..! గ్రామ బ‌హిష్క‌ర‌ణ చేస్తున్న ప్ర‌జ‌లు..!!

అదికార పార్టీ నేత‌ల‌కు సెగ‌..! గ్రామ బ‌హిష్క‌ర‌ణ చేస్తున్న ప్ర‌జ‌లు..!!

అయితే, కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి కలిసి ఏర్పడిన ప్రజాకూటమిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. నామినేషన్‌ దాఖలు చేసే వరకు సీట్ల సర్ధుబాటు పూర్తవకపోవడంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో చాలా మంది రెండు రోజుల క్రితమే ప్రచారాన్ని ప్రారంభించారు. కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రచారం చేయడానికి వెళ్తే ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో ఏం చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

 ప్ర‌తిప‌క్షాల‌కు కూడా నిర‌శ‌న సెగ‌లు..! జానారెడ్డికి చేదు అనుభ‌వం..!!

ప్ర‌తిప‌క్షాల‌కు కూడా నిర‌శ‌న సెగ‌లు..! జానారెడ్డికి చేదు అనుభ‌వం..!!

తాజాగా ఇలాంటి పరిస్థితే కాంగ్రెస్ నేతకు ఎదురైంది. తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న జానారెడ్డికి.. చేదు అనుభవం ఎదురైంది. నాగార్జునపేటలో కొందరు స్థానికులు జానారెడ్డిని అడ్డుకున్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి ఏదంటూ ప్రశ్నించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికిలోనైన జానారెడ్డి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. వారు వెళ్లకపోగా ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అప్పుడు సహనం కోల్పోయిన జానారెడ్డి మీరు ఓటువేస్తే ఎంత.. వేయకపోతే ఎంతని జానారెడ్డి మండిపడ్డారు.

 స‌హ‌నం కోల్పోతున్న నేత‌లు..! జ‌వాబుదారీ త‌నం లేక‌నే ఇబ్బందులు..!!

స‌హ‌నం కోల్పోతున్న నేత‌లు..! జ‌వాబుదారీ త‌నం లేక‌నే ఇబ్బందులు..!!

దీంతో ఆగ్రహించిన ప్రజలు జానాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తర్వాత కాంగ్రెస్ నాయకులు వారిని పక్కకు తీసుకెళ్లడంతో జానారెడ్డి ప్రచారం కోసం ముందుకు వెళ్లారు. ఈ వ్యవహారం వైరల్ కావడంతో జానారెడ్డి తీరుపై విమర్శలు వర్షం కురుస్తోంది. ఒక పార్టీకి పెద్ద నాయకుడై ఉండి ఇలా సహనం కోల్పోయి మాట్లాడడం ఏంటని పలువురు ప్రశ్నలు సంధిస్తుండగా, మరికొందరు మాత్రం వయసుకు గౌరవమిస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఇక్క‌డ ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన చైత‌న్యం, తెగింపు మీద కూడా పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
Telangana people seem to be dealing intellectually. They have been bluntly laughing at the tasks that have not been humiliated to the leaders coming for votes. Whether it is the party leader, the leaders of the Opposition party do not calculate and ask the point where they ask the leaders. In the same concern opposition leader JanaReddy faced the bitter experience from the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X