దేశంలోనే తొలిసారి గ్రామ పంచాయతీల రైజింగ్‌ ప్లాన్!

తెలంగాణ గ్రామాలు ఇక కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయి. తెలంగాణలో గ్రామాల సమగ్రాభివృద్ధికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక అడుగు వేసింది. ప్రతి గ్రామపంచాయతీకి "గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక - GPSAP 2026"ను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ నూతన విధానాన్ని రూపొందించారు.

దీని ద్వారా ప్రతి గ్రామంలోని జనాభా, కుటుంబాల స్థితిగతులు, ఉపాధి, గృహవసతి, పశుసంపద మరియు ప్రభుత్వ పథకాల లబ్ధిపై సమగ్ర ప్రొఫైల్ తయారు చేస్తారు. రాబోయే 3 నుండి 5 ఏళ్ల సుదీర్ఘ అభివృద్ధి ప్రణాళికతో పాటు ప్రస్తుత సంవత్సరానికి ప్రత్యేక వార్షిక ప్రణాళికను సిద్ధం చేస్తారు. పారదర్శకత కోసం ప్రతి పంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్, డాష్‌బోర్డ్‌ ఏర్పాటు చేయనున్నారు. తప్పుడు సమాచారం ఇస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు.

Telangana Rising 2047 Telangana Launches First-of-Its-Kind Gram Panchayat Comprehensive Development Plans Under Rising 2047 Vision

'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్య సాధనలో భాగంగా ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన ఉద్దేశం.'తెలంగాణ రైజింగ్‌-2047' అనే బృహత్తర లక్ష్యం కింద గ్రామీణ ప్రాంతాలను సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాలు వర్తిస్తాయి.ప్రతి గ్రామానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి, ఆ వెబ్‌సైట్‌లో గ్రామ సమస్త సమాచారం నమోదు చేయాలి. జనాభా వివరాలు, పంటలు, ఉపాధి అవకాశాలు, గృహవసతి పరిస్థితి, భూమిలేని కూలీలు, బలహీన వర్గాలు, ఆస్తులు, పశుసంపద, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా వంటి వివరాలన్నీ ఉండాలి.

అలాగే గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పూర్తి వివరాలు కూడా పొందుపరచాలి. ప్రత్యేక రిజిస్టర్‌ నిర్వహించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లకు సంబంధించిన సమగ్ర దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను ఇందులో చేర్చాలి. నెలనెలా సాధించిన పురోగతిని నవీకరించాలి. గ్రామ పంచాయతీలు ఏ సమాచారం అడిగినా సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా అందించాలి.

సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55వేల మరణాల అంచనా!
సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55వేల మరణాల అంచనా!

సమాచారం ఇవ్వకపోయినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్‌ 135 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మండల స్థాయిలో ఎంపీడీవో బాధ్యత వహిస్తారు. ప్రతి నెలా జరిగే పంచాయతీ సమావేశాల్లో సర్పంచులు ప్రణాళికలపై సమీక్ష చేయాలి. మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ కూడా సమీక్షించాలి. ప్రజలు, అధికారులు అభివృద్ధి ప్రణాళికలు, పనుల పురోగతిని సులభంగా తెలుసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేసేలా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+