ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం
ఇంధన కొరత భయాల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఛార్జీలపై 30 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ కష్టాలు పడొద్దని వాహనదారులకు ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల క్యూ లైన్లను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. వ్యక్తిగత వాహనాల కోసం పెట్రోల్ బంకుల వద్ద వేచి ఉండకుండా ప్రజా రవాణాను వినియోగించుకోవాలని ఎండీ నాగిరెడ్డి సూచనలు చేశారు. ఈ నిర్ణయం వల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా.. కాలుష్యం తగ్గుతుందని, అలాగే సౌకర్యవంతమైన ప్రయాణం దక్కుతుందన్నారు.
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్ లోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీని ప్రకటించింది. ప్రస్తుతం ఇంధన పరిస్థితి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి.. ప్రయాణాలకు ప్రభుత్వ బస్సులను ఎంచుకోవాలని కోరారు. మనందరం కలిసి ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చని స్పష్టం చేశారు. బంకుల్లో అనవసర రద్దీ సృష్టించొద్దని సూచనలు చేశారు.
In view of the current fuel situation, we have introduced a 30% fare discount on Metro AC & Metro Deluxe services.
— Ponnam Prabhakar (@Ponnam_INC) March 25, 2026
I urge citizens to stay calm and opt for public transport for a safe, economical, and comfortable commute.
Together, we can manage this efficiently.
Let us act…
ఇక హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని.. నగర వ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని.. దీనిని కొరతగా భావించొద్దని కోరారు.

ఇక నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications