Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.10 లక్షలు ఖర్చు చేసినా గెల్వలేదు.. ఈ సర్పంచ్ అభ్యర్థి ఏం చేశాడో తెలుసా..?

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇటీవల మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. తొలి విడతలో 4,230 గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించారు. ఇందులో అధికార కాంగ్రెస్ మద్దతు దారులు 2,425 స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్​ఎస్​ బలపరిచిన అభ్యర్థులు 1,168 స్థానాల్లో గెలుపొందారు. అలాగే బీజేపీ అభ్యర్థులు 189 స్థానాల్లో ఎన్నికయ్యారు. ఇక స్వతంత్రులు 401 స్థానాల్లో విజయం సాధించారు. అయితే తెలంగాణలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయినా.. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల్లో తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా నల్గొండ జిల్లా నార్కట్‌ పల్లి మండలం ఔరవాని గ్రామానికి చెందిన కల్లూరి బాలరాజు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కల్లూరి బాలరాజు బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి జక్కల పరమేశ్ సర్పంచ్ గా విజయం సాధించారు. జక్కల పరమేశ్ చేతిలో 450 ఓట్ల తేడాతో బాలరాజు ఓటమి పాలయ్యారు. అయితే ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలన్న కోరికతో ఈ ఎన్నికల్లో బాలరాజు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు పెట్టారు. అయితే ఓడిపోవడంతో తాను ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్ల వసూలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Telangana Sarpanches Plead Door-to-Door Return the Money We Gave During Elections

సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తానని భావించి బాలరాజు ఓటమిపాలు కావడంతో తీవ్ర మనోవేధనకు లోనయ్యాడు. దాంతో బాలరాజు చేతిలో దేవుడి ఫోటో పెట్టుకుని నగదు వసూలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో తాను పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని దేవుడి ఫోటోతో గడప గడప తొక్కి అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బాలరాజు భార్య ఏకంగా పురుగుల మందు డబ్బే చేతిలో పట్టుకుని మరీ బెదిరిస్తూ తమ నగదును వసూలు చేసుకుంటున్నారు. అయితే తాము మీకే ఓట్లు వేశామంటూ దేవుడిపై ప్రమాణం చేస్తున్నారు గ్రామస్థులు. అందరూ ఓట్లు వేస్తే మరి తాను ఎలా ఓడిపోయానంటూ బాలరాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+