హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ssc పరీక్షలు: 10వ తరగతి షెడ్యూల్ విడుదల, పరీక్షలు మే 11వ తేదీ నుంచి ప్రారంభం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షలు మే 11,2022న ప్రారంభంకానున్నాయి. చివరి పరీక్ష మే 20, 2022తో ముగియనుంది. గత రెండు అకాడమిక్‌ ఇయర్స్‌లో కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో పరీక్షలను నిర్వహించడానికి బోర్డ్‌ మొగ్గు చూపింది. ఇక కరోనా థార్డ్‌ వేవ్‌ కూడా తగ్గుముఖం పట్టడం, స్కూళ్లు తిరిగి ఓపెన్‌ కావడంతో ఈసారి పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

Telangana ssc exams: 10th class schedule released, exams are from May 11th.

పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్‌ వివరాలు:
11-05-2022 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

12-05-2022 సెకండ్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

13-05-2022 థార్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

14-05-2022 మ్యాథమెటిక్స్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

16-05-2022 జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

17-05-2022 సోషల్‌ స్టడీస్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

18-02-2022 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ - 1, (సంస్కృతం, అరబిక్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

19-05-2022 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ - 2 (సంస్కృతం, అరబిక్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు.

20-05-2022 ఎస్‌ఎస్‌సీ వొకేషనల్ కోర్స్‌ (థియరీ) ఉదయం 9:30 గంటల నుంచి 11:30 వరకు.

పాలిటెక్నిక్‌ ప్రశ్నాపత్రాల లీక్: 8,9న జరిగిన ఎగ్జామ్స్ రద్దు

తెలంగాణలో పాలిటెక్నిక్‌ ప్రశ్నాపత్రాల లీక్ కారణంగా 8,9న జరిగిన పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఫిబ్రవరి 15, 16న మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. స్వాతి కాలేజీలో ఎగ్జామ్‌ సెంటర్ రద్దు చేశారు. స్వాతి కాలేజీ విద్యార్థులను అధికారులు మరో కాలేజీకి బదిలీ చేశారు.

పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేపర్‌పై ఉన్న వాటర్ మార్క్ ఆధారంగా స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజీలో లీకైనట్లు గుర్తించారు. మెదక్‌లోని చేగుంట పాలిటెక్నిక్ కాలేజీలో ఎగ్జామ్ టైం దాటుతున్న విద్యార్థులు రాకపోవడంతో కాలేజీ స్టాఫ్‌కు అనుమానం రావడంతోనే ఈ గుట్టు బయటపడింది.

విద్యార్థులు ఆలస్యంగా వస్తుండటంతో అనుమానం వచ్చి.. విద్యార్థుల ఫోన్లు చెక్‌ చేయగా అందులో ఎగ్జామ్‌కి ముందే పేపర్లు కనిపించాయి. దీంతో వారు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు.. స్వాతి కాలేజ్‌ ఎగ్జామ్‌ సెంటర్‌ను రద్దు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పేపర్‌ లీకేజీ గురించి తమకు తెలియదని స్వాతి కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిన అబ్జర్వేటర్ సమక్షంలోనే పేపర్లను ఓపెన్‌ చేశామంటున్నారు.

English summary
Telangana ssc exams: 10th class schedule released, exams are from May 11th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X