తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బరిలో 525 మంది: అత్యధికం, అత్యల్పం ఈ స్థానాల్లోనే
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ల దరఖాస్తులను పరిశీలించి 525 మంది అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్నికల భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అత్యధికంగా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీలో ఉన్నారన్నారు. అలాగే 285 మంది స్వతంత్రులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వికాస్ రాజ్ వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు ఈసీ వికాస్ రాజ్ తెలిపారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ఒక్క ఈవీఎం మాత్రమే సరిపోతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనంగా కొన్ని ఈవీఎంలు రప్పిస్తున్నామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌ను జిల్లాల్లో ప్రింట్ చేస్తున్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో 3,986 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయన్నారు. 2.94 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నామని, పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ఈసీ వికాస్ రాజ్ వివరించారు.
మరోవైపు, ఎన్నికల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1950 ఏర్పాటు చేశామని వికాస్ రాజ్ తెలిపారు. టోల్ ఫ్రీ నంబరు ద్వారా ఇప్పటివరకు 1,227 ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 15 వేల మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందన్నారు.
-
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications