ఒక్కొక్కరిపై 1.50 లక్షల అప్పు, తీసుకొస్తోన్న అప్పుపై శ్వేతపత్రం విడుదల చేయండి: భట్టి
సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైరయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. ఎఫ్ఆర్‌బీఎం 5 శాతం పెంచుతూ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం తీసుకొచ్చారని గుర్తుచేశారు. బ్యాంక్ గ్యారెంటీ కోసం 90 శాతం నుంచి 200 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చాచ్చారని మండిపడ్డారు. దీంతో అప్పులు మాత్రం భారీగా పెరిగిపోతు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణ మార్చారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో అప్పు 68 వేల కోట్లు ఉండేదని.. అది క్రమంగా పెరిగినట్టు పెరిగిపోతుందని చెప్పారు. 2019-20లో రూ. 2 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. వచ్చే ఏడాది అది 3.20 లక్షల కోట్లకు చేరుతుందనన్నారు. 2023 నాటికి రాష్ట్రం అప్పు 6 లక్షల కోట్లకు చేరుతుందని భట్టి వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై లక్ష 50వేల అప్పు ఉంటుందన్నారు.

రాష్ట్రంలో వ్యక్తి తలసరి ఆదాయం రూ. 2 లక్షలు అని భట్టి గుర్తుచేశారు. జాతీయ ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం మెరుగ్గా ఉందన్నారు. కానీ తీసుకొస్తున్న అప్పుల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. నిధులన్నీ ఏమవుతున్నాయని అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పులపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రానికి, ఆర్థిక సంస్థలకు అప్పులు ఇవ్వొద్దని చెప్తామన్నారు.
Recommended Video
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే..












Click it and Unblock the Notifications