వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిట్‏తో రాష్ట్రం.. ఐటీ,ఈడీ,సీబీఐతో కేంద్రం.. పాలన గాలికేనా..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పరోక్ష యుద్ధం కొనసాగుతోంది. సిట్ తో రాష్ట్రం.. అటు ఐటీ, ఈడీ, సీబీఐతో కేంద్రం సై అంటే సై అంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో మొదలైన ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ కేసులో బోయిన్ పల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం తెరపైకి తెచ్చింది.

రామచంద్రభారతి

రామచంద్రభారతి

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన తాండురు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లపూర్ ఎమ్మెల్యే బీరం అర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావుతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కొనుగోలు చేసేందుకు రామచంద్రభారతి, సింహయాజీ, నంద కుమార్ ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించింది.

బీఎల్​ సంతోష్

బీఎల్​ సంతోష్

ప్రస్తుతం సిట్ ఈ కేసుతో సంబంధం ఉన్న అందిరికి నోటీసులు ఇచ్చింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్ కు​ నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఆయుధంతో యుద్ధం చేస్తున్న సమయంలోనే కేంద్ర మరింత దూకుడు పెంచింది. క్యాసినో కేసు వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ఈడీ విచారించింది. మంత్రి సోదరులు, పీఏను కూడా విచారించింది.

గంగుల కమలాకర్

గంగుల కమలాకర్

గ్రానెట్ వ్యాపారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఐటీ, ఈడీ అధికారులు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ మద్దిరాజు రవిచంద్ర కార్యాయాల్లో కూడా సోదాలు నిర్వహించారు.

మల్లారెడ్డి

మల్లారెడ్డి


తాజాగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లు, యూనివర్సిటీ, మెడికల్ కాలేజీల్లో ఐటీ సోదాలు నిర్వహించింది.దాదాపు 50 బృందాలతో మూడు రోజుల పాటు ఈ సోదాలు కొనసాగాయి. మల్లారెడ్డి భూము కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. మల్లారెడ్డికి సంబంధించిన ‌ఇల్లు, కార్యాలయాలు, బంధువులు ఇళ్లు, యూనివర్సిటీ, మెడికల్ కాలేజీల్లో ఐటీ అధికారులు భారీగా నగదుతో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

రేవంత్ రెడ్డి, అర్వింద్

రేవంత్ రెడ్డి, అర్వింద్


అయితే మల్లారెడ్డిపై ఎప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో పలు ఆరోపణలు చేశారు. మరోవైపు నిజమాబాద్ ఎంపీ అర్వింద్ మల్లారెడ్డి సంబంధించిన మెడికల్ కాలేజీల్లో సీట్లను భారీ నగదుకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇలా ఇటు సిట్ తో రాష్ట్రం.. అటు ఐటీ, ఈడీ, సీబీఐతో కేంద్రం తలపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పుతుందని విమర్శలు వస్తున్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోరులో గెలిచేది ఎవరో చూడాలి మరి.

English summary
The state with SIT.. and the center with IT, ED, CBI is called sy. This war, which started with the Delhi liquor scam, continues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X