పశ్చిమ బెంగాల్‌లో టీ విద్యార్థి మృతి: పాము చంపేసి కాటుకు బలయ్యాడు
హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునగాల మండలం రామలింగంబండకు చెందిన యర్రంశెట్టి వంశీ(19) అనే విద్యార్తి శు క్రవారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హుబ్లీనదిలో మునిగి మృతిచెందాడు. యర్రంశెట్టి రాజ్యం, జితేందర్ దంపతుల రెండో కొడుకైన వంశీ దుర్గాపూర్ ఎన్‌ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
శుక్రవారం కళాశాలకు సెలవుదినం కావడంతో స్నేహితులతో కలిసి వినోదం కోసం సమీపంలోని హుబ్లీ నదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి మృతిచెందాడు. మూడు రోజుల కిందటే స్టడీలోన్ నిమిత్తం సంతకాల కోసం వంశీ దగ్గరికి తండ్రి జితేందర్ వెళ్లారు.
సంతకాలు చేయించుకుని శుక్రవారం కోదాడకు చేరుకోగానే వంశీ స్నేహితులు ఫోన్ చేశారు. మృతివిషయాన్ని నేరుగా చెప్పకుండా నదిలో పడిపోయాడని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పడంతో భార్య, బంధువులతో కలిసి ఆయన రాత్రి తిరిగి బయలేదేరారు.

ఇదిలావుంటే, ఆదిలాబాద్ జిల్లాలో పామును చంపిన వ్యక్తి దాని కాటుకు బలయ్యాడు. కోటపల్లి మండలం సర్వాయిపేటకు చెందిన చింతపూడి రాజయ్య ఇం ట్లోకి శుక్రవారం తాచుపాము రావడంతో పాములను అలవోకగా పట్టే ఈర్ల రామయ్య(47)ను పిలిపించాడు.
రామయ్య పామును పట్టే క్రమంలో తోకను పట్టుకోవడంతో అతని చేతిపై రెండు చోట్ల కాటువేసింది. అయినప్పటికీ పామును చంపేసిన రామయ్య ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు 108కు ఫోన్‌చేశారు. అంబులెన్స్ వచ్చేలోగానే అతను మృతిచెందాడు.












Click it and Unblock the Notifications