బాత్రూం నుంచి ఈడ్చుకొచ్చి, వివస్త్రను చేసి దాడి: సుశ్రుత కొడుకు(పిక్చర్స్)
హైదరాబాద్: నీళ్లు వేడి చేసేందుకు హీటర్‌ను ఎక్కువసేపు వాడావంటూ సుశ్రుతను బాత్రూం నుంచి ఈడ్చుకొచ్చి, వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టి ఆమె బలవన్మరణానికి కారణమైన ఆమె భర్త మోహన్‌రావును, అతని కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి.
మోహన్ రావును ఉరి తీయాలంటూ సుశ్రుత కుటుంబ సభ్యులతో పాటు మహిళాసంఘాల ప్రతినిధులు ఉస్మానియా ఆస్పత్రి వద్ద సోమవారం ధర్నాకు దిగారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రధాన గేటు మూసి వేసి నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ధర్నా చేపట్టిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
కాగా, మృతురాలు సుశ్రుత కుమారుడు శ్రీవాస్తవ తన తల్లిపై దాడిని వివరించాడు. హీటర్ ఎక్కువ సేపు పెట్టుకుందని తాత, నానమ్మలు చెప్పగానే.. తన తండ్రి మోహన్ బాత్రూంలోకి వెళ్లి తన తల్లి సుశ్రుతను అలాగే బయటికి ఈడ్చుకొచ్చాడని తెలిపాడు. ఆ తర్వాత తీవ్రంగా కొట్టాడని చెప్పాడు. తన తల్లి ఎంత వేడుకున్నా తన తండ్రి మోహన్ రావు కనికరించలేదని చెప్పాడు. నైటీ వేసుకునే ఉన్న తన తల్లి వస్త్రాలను లాగేసి అందరి ముందే తీవ్రంగా కొట్టాడని శ్రీవాస్తవ తెలిపాడు. ఎవరూ అడ్డుకోకపోగా, తన తండ్రికే మద్దతుగా ఉన్నారని శ్రీవాస్తవ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆందోళన
కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది... మీ అమ్మ ఇస్తుందా? అంటూ దుర్భాషలాడ్డం... అనంతరం సుశ్రుతను వివస్త్రను చేసి కొట్టడమే కాకుండా హత్య చేశారని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు.
01.jpeg

కుటుంబసభ్యుల ఆందోళన
సైదాబాద్‌లో ఉంటున్న మోహన్ మంచివాడనుకుని ఎనిమిదేళ్ల క్రితం తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశామని సుశ్రుత తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి సమయంలో 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల కట్నం ఇచ్చామని, ఇద్దరు పిల్లలు శ్రీవాత్సవ(6), మనూరావు(4)లున్నా తరచూ గొడవ పడి అదనపు కట్నం కోసం వేధించేవారని విమర్శించారు.

మహిళా సంఘాల ధర్నా
ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనీ, వారం రోజుల క్రితమే తమకు ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసిందని తెలిపారు. చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తీసుకువచ్చి పడేశారని ఆరోపించారు.

సుశ్రుత ఫైల్ ఫొటో
ఉదయం 9.45 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని అరగంటకే బంధువుల్ని పంపించేసరికి సుశ్రుత మృతదేహాన్ని పోలీసులు దగ్గరుండి మార్చురీకి తరలించారని ఆరోపించారు. వీరి ధర్నా వల్ల ఆస్పత్రిలోపలికి వచ్చేవారు ఇబ్బందులకు గురయ్యారు. కుమార్తె చనిపోయి బాధలో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్న తమ కుటుంబీకుల్ని పోలీసులు అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

విలపించిన కుటుంబసభ్యులు
కుమార్తె మృతదేహానికి సైదాబాద్ సమీపంలోని శానవాటికలోఅంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. సైదాబాద్ బస్తీవాసులు సైదాబాద్‌కు మృతదేహాన్ని తీసుకుని రావద్దంటూ చెప్పడంతో ఇరువర్గాలు పరస్పరం దూషించుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సుల్తాన్‌బజార్ ఏసీపీ, అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, మహిళా కానిస్టేబుళ్లు పెద్ద సంఖ్యలో ఉస్మానియా చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.

సుశ్రుత మృతదేహం
కాగా, నూతలకంటి సుశ్రుత (31) మృతికి కారకులైన భర్త మోహన్‌రావు, మామ శంకర్‌రావు, అత్త ఉమలను సైదాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. సాయంత్రం వరకూ మృతదేహం తరలింపులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు సాయంత్రం సుశ్రుత మృతదేహాన్ని సూర్యాపేటకు తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications