తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటీ?
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి హ్యాట్రిక్ కొట్టడానికి సమాయాత్తమౌతోంది.
అటు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికల కోసం వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నాయి. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా.
ఈ పరిస్థితుల మధ్య- తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్.. తెలంగాణ రాజకీయాలపై ఓ సర్వేను నిర్వహించింది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది ఈ సర్వే సంస్థ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తారనేది స్పష్టం చేసింది.
ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే- మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు పడే ఓట్ల శాతం.. 40. 40 శాతం మేర ఓట్ల తేడాతో గులాబీ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చింది పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే. ముఖ్యమంత్రిగా కేసీఆర్.. మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు పోల్ అవుతాయి. భారతీయ జనతా పార్టీ పడే ఓట్ల శాతం 16కే పరిమితమైంది ఈ సర్వే ప్రకారం చూస్తే. ఇతరులు 10 శాతం మేర ఓట్లు సాధిస్తారని అంచనా వేసింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని చెబుతున్నా వారి సంఖ్య 43 శాతం. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలంటూ 43 శాతం మంది తెలంగాణ ప్రజలు కోరుకుంటోన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని 29 శాతం మంది భావిస్తోన్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది. బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సీఎం అవుతారని చెబుతున్నారు నాలుగు శాతం చొప్పున ఉన్నారు.
తెలంగాణలో 45 శాతం మంది ప్రజలు కేసీఆర్ పరిపాలనను మెచ్చుకుంటోన్నారు. ఆయన పాలన బాగుందంటూ ప్రశంసిస్తోన్నారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని చెబుతున్న వారు 17 శాతం మంది ఉన్నారు. 20 శాతం మంది కేసీఆర్ పాలన బాగోలేదని తేల్చి చెబుతున్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధ్వాన్నంగా పని చేస్తోందంటూ 15 శాతం, ఎటూ చెప్పలేమంటోన్న వారు మరో మూడు శాతం మంది ఉన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications