హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ రాజకీయ రాబందు: టీటీడీపీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదారాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాబందులా మారి ఇతర పార్టీల ఎమ్మెల్యను కోనుగోలు చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు శుక్రవారం కుందన్‌బాగ్‌లోని స్పీకర్‌ మధుసూదనాచారిని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

అనంతరం ఎల్. రమణ మాట్లాడుతూ తెలంగాణను కేసీఆర్‌ ప్రత్యేక దేశంగా భావిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టాలు అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. మహిళల హక్కుల రక్షణ కోసం నిర్భయ చట్టం తీసుకొచ్చినట్లుగా కేసీఆర్‌ ఫిరాయింపుల ప్రోత్సాహాన్ని నిరోధించేందుకు రాజకీయ నిర్భయ చట్టాన్ని తీసుకురావాలని అన్నారు.

 సీఎం కేసీఆర్ రాజకీయ రాబందు

సీఎం కేసీఆర్ రాజకీయ రాబందు

తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే తలసాని రాజీనామా పత్రాన్ని చూపిస్తూ గొప్పలు చెప్పి మంత్రిగా కొనసాగుతున్నారనీ, ఆయన్ని మంత్రి వర్గం నుంచి ఎందుకు తొలగించడం లేదని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే కృష్ణారావును కేసీఆర్‌ తన ఫాంహౌజ్‌కు తీసుకెళ్లి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని ఆరోపించారు.

 సీఎం కేసీఆర్ రాజకీయ రాబందు

సీఎం కేసీఆర్ రాజకీయ రాబందు

దీనిపై అన్ని ఆధారాలు, సాక్ష్యాలతో స్పీకర్‌కు వినతి పత్రం అందజేశామని చెప్పారు. తెలంగాణ ప్రజల గౌరవం పెంచేవిధంగా ఈనెల 30లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు.

సీఎం కేసీఆర్ రాజకీయ రాబందు

సీఎం కేసీఆర్ రాజకీయ రాబందు


టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మంత్రులు, శాసన మండలి చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ప్రొటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు.

 సీఎం కేసీఆర్ రాజకీయ రాబందు

సీఎం కేసీఆర్ రాజకీయ రాబందు


తన శాసన సభ ని యోజకవర్గంలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలపై అధికారులు ప్రొటోకాల్‌ పాటించడంలేదని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే సాయన్న, పార్టీ సీనియర్‌ నేత రావుల తదితరులు ఉన్నారు.

English summary
Telangana tdp leaders fires on cm kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X