ఎన్నికల బరిలో తెలంగాణ తెలుగుదేశం.. పుకార్లకు చెక్!!

తెలంగాణలో జరిగే శాసన సభ ఎన్నికల్లో పోటీ కి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఇక్కడ పోటీ పై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పోటీపై కొంత నెమ్మదించినట్లు కనబడటంతో పొలిటికల్ స్ట్రీట్ లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

చంద్రబాబు అరెస్టు కన్నా ముందుతెలుగు దేశం పార్టీ కూడా తెలంగాణ లో పోటీలో ఉంటుంది. భావ సారూప్యత పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నం కూడా చేస్తోందంటూ రకరకాల కథనాలు వచ్చాయి. కానీ బాబు అరెస్టు తరువాత ఆపార్టీ కొంత నెమ్మదించినట్లు కనబడటం తో తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ పోటీలో నే ఉండదంటూ సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి.

Telangana Telugudesam in the election ring.. Check to rumors

కానీ ఒకటి రెండు రోజుల్లో ఆ రూమర్లకు చెక్ పడే అవకాశం ఉన్నట్లు ఆపార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని ఇటీవల చంద్రబాబు నాయుడును ములఖత్ లో కలిసిన టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది... తెలంగాణ లో కూడా పోటీ చేయడం ద్వారా పార్టీ పట్టు నిలుపుకోవచ్చని అధినేత చంద్రబాబు కు సూచించినట్లు సమాచారం.

దీనిపై పలు అంశాలు చర్చించిన అనంతరం జ్ఞానేశ్వర్ పై నమ్మకం తో చంద్రబాబు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే తమకు బలమున్న స్థానాల్లో పరిమిత సీట్లతో పోటీ చేయాలా లేక మొదట తాము చెప్పినట్టు 87 స్థానాల్లో పోటీ చేయాలా అనే అంశం పై స్పష్టత రావాల్సి ఉంది.

రేపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో జరిగే భేటీలో ఈ అంశంపై చర్చించిన తరువాతనే పోటీ పై స్పష్టత రానుంది. లోకేష్ తో జరిగే భేటీ లో పోటీ తో పాటు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పై కూడా చర్చ జరిగే అవకాశం ఉండటంతో... రేపటి లోకేష్, జ్ఞానేశ్వర్ భేటీ కి ప్రాధాన్యత ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+