Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఏసీలు లేకుండా చల్లనైన ఫ్యూచర్ సిటీ!

తెలంగాణ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచం మొత్తం ఫోకస్ చేసేలా నిర్మాణం చేస్తుంది. నేటి ఆధునిక కాలంలో చిన్న కార్యాలయాల నుండి ఇళ్ళ వరకు ఏసీలు వాడుకో అనివార్యమైన వేళ 30 వేల ఎకరాలలో నిర్మించాలి అనుకుంటున్న ఫ్యూచర్ సిటీలో ఏసీలు లేకుండానే, ఏసీ అవసరంలేని విధంగా నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఫ్యూచర్ సిటీలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్
ఈ వార్త ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ను అమలు చేస్తారు. తెలంగాణ విజన్ 2047 పత్రంలో ప్రకటించిన ఈ వినూత్న విధానం నగర నిర్మాణంలో కీలకం కానుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రవేశపెట్టనున్న డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఒక కేంద్రీకృత శీతలీకరణ విధానంగా చెబుతారు.

Telangana to Introduce District Cooling System in Prestigious Future City

సాంప్రదాయ ఏసీలతో పోలిస్తే 30% విద్యుత్ ఆదా
శుద్ధిచేసిన నీటిని 5డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరిచి ఆ నీటిని ప్రత్యేక పైపుల ద్వారా భవనాలకు పంపుతారు. ప్రతి భవనంలో ఉండే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు ఈ చల్లని నీటిని ఉపయోగించి గది ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. అనంతరం వేడెక్కిన నీటిని తిరిగి శీతలీకరణ కేంద్రానికి పంపి మళ్లీ చల్లబరిచి సరఫరా చేస్తారు. ఈ నిరంతర ఆవర్తనం వల్ల సాంప్రదాయ ఏసీలతో పోలిస్తే 30% విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.

అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ.. నిజంగానే ఫ్యూచర్ సిటీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, లైఫ్ సైన్సెస్ హబ్ వంటి విభాగాలతో అభివృద్ధి చెందుతున్న ఈ నగరంలో విద్యుత్ ఆదా చేయడం, పర్యావరణపరిరక్షణను చేయడం వంటి ప్రధాన లక్ష్యాలతో ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. నగరాలలో ఏసీలు వాడకం పెరిగిపోయి భరించలేని వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో, ఈ సమస్యకు పరిష్కారంగా, డిసిఎస్ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది.

డిసిఎస్ తో భారత్ ఫ్యూచర్ సిటీకి కొత్తదనం
గుజరాత్ రాష్ట్రంలోని గిఫ్ట్ సిటీ ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తుండగా, తెలంగాణలోనూ పోచారం లోని ఇన్ఫోసిస్ లో, ఐటీ కారిడార్ లోని ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఈ డి సి ఎస్ వ్యవస్థ ప్రస్తుతం పనిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మరింత ఆధునికమైన డి సి ఎస్ ను భారత్ ఫ్యూచర్ సిటీకి పరిచయం చేయబోతుంది. ఈ విధానం భవిష్యత్తు నగరాలు, మాల్స్, టౌన్షిప్ లలో ఏసీలు లేకుండానే సమర్థవంతంగా చల్లదనాన్ని అందించే మార్గాలకు నాంది పలుకుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+