పర్యాటక ప్రియులు.. మీకే ఈ అద్భుత అవకాశం.. రేపే లాస్ట్ డేట్!

ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అవార్డులు-2026 కోసం పర్యాటక శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పర్యాటక అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు త్వరపడాలని, రేపే లాస్ట్ తేదీ అని చెప్తోంది. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, పర్యాటక సంస్థలు తదితరులకు వివిధ విభాగాల్లో అవార్డులు అందించనున్నారు.

ఈ విభాగాలలో పర్యాటక అవార్డులు

పర్యాటక రంగానికి సంబంధించిన రచనలు, ప్రచురణలు, తెలంగాణ పర్యాటకంపై ఉత్తమ చిత్రం, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, పర్యాటక గైడ్, గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, పర్యాటక విద్యాసంస్థలు, వైద్య పర్యాటకం, వినోద పార్కులు, వినూత్న పర్యాటక ప్రాజెక్టులు, సామాజిక మాధ్యమాలు, యువ పర్యాటక క్లబ్ తదితర విభాగాల్లో అవార్డులు ప్రకటించనున్నారు.

Telangana Tourism Department invites applications for Telangana State Tourism Awards 2026 last date tomorrow

హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు అవార్డులు గెలుచుకునే అవకాశం

హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు తదితర విభాగాల్లో పనితీరు, వాతావరణం, పరిశుభ్రత, సేవలు, సౌకర్యాలు, పర్యాటకుల సంఖ్య, టర్నోవర్, విదేశీ మారకద్రవ్య ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పర్యావరణహిత విధానాలు, దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పునరుత్పాదక ఇంధన వినియోగం, వ్యర్థాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, కొత్త పద్ధతులు, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురితమైన వ్యాసాలకు అర్హత

పర్యాటక రచనల విభాగంలో తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురితమైన వ్యాసాలు అర్హత పొందుతాయి. ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, వైద్య పర్యాటక సంస్థలు తదితరులు అవసరమైన చోట చార్టర్డ్ అకౌంటెంట్ లేదా చట్టబద్ధ ఆడిటర్ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అవార్డుల ఎంపిక కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీలు దరఖాస్తులను పరిశీలిస్తాయి.

పరిగణనలోకి తీసుకునే అంశాలు ఇవే

అవసరమైన సందర్భాల్లో సంబంధిత పర్యాటక ప్రాంతాలు, సంస్థలు, హోటళ్లు, రిసార్టులు తదితరాలను కమిటీ సభ్యులు స్వయంగా సందర్శించి పరిశీలిస్తారు. ఎంపికలో మార్గదర్శకాల్లో పేర్కొన్న అర్హతలు, పనితీరు, నాణ్యత, పర్యాటక రంగానికి అందించిన సేవలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియలో పర్యాటక శాఖ డైరెక్టర్ నిర్ణయం తుది నిర్ణయంగా ఉంటుంది.

నేను మాట్లాడితే మా అమ్మను బలి చేస్తారనుకోలేదు: వెక్కి వెక్కి ఏడ్చిన కొండా సుస్మిత
నేను మాట్లాడితే మా అమ్మను బలి చేస్తారనుకోలేదు: వెక్కి వెక్కి ఏడ్చిన కొండా సుస్మిత

రేపే దరఖాస్తులకు లాస్ట్ డేట్.. మిస్ చేసుకోకండి

అర్హత కలిగిన వారు పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ప్రతిపాదనలు, ధ్రువపత్రాలు, ఫొటోగ్రాఫ్‌లు, ఇతర ఆధారాలను జతచేసి సెప్టెంబర్ 7, 2026లోగా సమర్పించాలి. దరఖాస్తులను డైరెక్టర్, పర్యాటక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, కళా భవన్, రవీంద్ర భారతి, సైఫాబాద్, హైదరాబాద్-500004 చిరునామాకు పంపాలి. వివరాల కోసం 9440816065, 9440816068 నంబర్లలో సంప్రదించవచ్చని పర్యాటక శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+