హైదరాబాద్-శ్రీశైలం: తక్కువ ఖర్చులో తెలంగాణ టూరిజం ప్యాకేజీ ఇదే
హైదరాబాద్: తెలంగాణ పర్యాటక శాఖ పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆకర్షణీయ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ జాబితాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం కూడా మంచి ప్యాకేజీ ఉంది. తక్కువ ఖర్చులో రెండు రోజులపాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ప్రతిరోజూ ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
ఈ టూర్‌లో తొలి రోజు ఉదయం 8.30 గంటలకు టూర్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లోని పర్యాటక్ భవన్ నుంచి 8.30 గంటలకు బస్సు బయలు దేరుతుంది. అనంతరం ఉదయం 9.00 గంటలకు బషీర్‌భాగ్‌లోని సీఆర్‌ఓ ఆఫీస్ వద్ద బస్సు ఆగుతుంది. శ్రీశైలంకు వెళ్లే దారిలోనే భోజనం చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. దారి మధ్యలో సాక్షి గణపతి గుడి దర్శనం ఉంటుంది. రాత్రి హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది.

ఈ పర్యటనలో ఇక రెండోరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయగానే రోప్ వే, పాలదార, పంచదార, శిఖరం, డ్యామ్‌ల సందర్శన ఉంటుంది. పర్యాటకులు తమ సమయానికి అనుగుణంగా దేవాలయ సందర్శన చేసుకోవాల్సి ఉంటుంది.
ప్యాకేజీ ధర వివరాలు గమనించినట్లయితే.. ఈ టూర్ ప్యాకేజీలో రెండు రకాల ధరలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ బస్సు ప్యాకేజీ, నాన్ ఏసీ అకామిడేషన్ ధర పెద్దలకు రూ. 2400 కాగా చిన్నపిల్లలకు రూ. 1920గా ఉంది. ఇక నాన్ ఏసీ బస్సు, నాన్ ఏసీ అకామిడేషన్ పెద్దలకు రూ. 2000, చిన్నారులకు రూ. 1600గా ఉంది.

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ట్రాన్స్‌పోర్టేషన్, అకామిడేషన్ ప్యాకేజీలో భాగమే.. కానీ, ఫుడ్, దర్శనంతో పాటు ఇతర ఖర్చులు ప్యాకేజీలో కవర్ కావు.












Click it and Unblock the Notifications