హైదరాబాద్ లో మెరుపు ధర్నా- ఉద్రిక్తత: రోడ్ బ్లాక్

హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిని నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆఫీస్ లోనికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు నల్లజెండాలు ప్రదర్శించారు. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. యూత్ కాంగ్రెస్ ముట్టడి పిలుపు నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులు లోపలికి దూసుకెళ్లకుండా బారికేడ్లను అమర్చారు. ఆ బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Telangana Youth Congress Protest at BJP Office in Hyderabad and Demanding Amit Shah Resignation

దేశవ్యాప్తంగా వివిధ విద్యా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాలు, పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే యువత రోడ్లపైకి వచ్చి పోరాడాల్సి వస్తోందని అన్నారు. విద్యార్థుల ఆగ్రహానికి కారణమైన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోందని, ఇప్పుడు హోం శాఖ కూడా విద్యార్థులపై హింసను ప్రేరేపించడం సిగ్గుచేటని అన్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో క్రీపీ సస్పెన్స్ థ్రిల్లర్.. హతః
టాలీవుడ్ యంగ్ హీరో క్రీపీ సస్పెన్స్ థ్రిల్లర్.. హతః

ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రోష్ని కుశాల్ జైస్వాల్ నాయకత్వం వహించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో, వారి భద్రతను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపై పోలీసు బలగాలతో అణచివేత చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లు, ఏకే 47 తుపాకులను సైతం ప్రయోగించారని ఆమె ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్
హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్

ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను రోడ్డుపై నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తమ పోరాటం ఆగేది లేదని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+