హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విస్తృత అవకాశాలు, ఒబామా హెలికాప్టర్ ఇక్కడే తయారీ: సిఐఐలో కెటిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో విద్య, వైద్యం, ఏరోస్పేస్, డిజిటల్, అగ్రికల్చర్, రోడ్లు, భవనాలు, ఆతిథ్యరంగం.. ఇలా అన్ని రంగాల్లోనూ మౌలిక సదుపాయల కంపెనీలకు విస్తృత అవకాశాలున్నాయని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం తమ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలు మౌలిక రంగానికి బాసటగా నిలుస్తున్నాయని చెప్పారు.

భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌డెక్కన్‌లో తెలంగాణలో మౌలిక సదుపాయాల రంగం-వృద్ధి అనే అంశంపై జరిగిన సెమినార్‌కు మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజకీయ నాయకుల కోణంలో సంక్షేమం-అభివృద్ధికే ప్రాముఖ్యం ఉంటుందన్నారు.

తెలంగాణలో ఈ రెండు అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే అందులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు వన్నెతెస్తూ అంతర్జాతీయంగా పేరు సాధిస్తున్న జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో పూర్తికావస్తున్న ఎల్‌ఆండ్‌టీ మెట్రో రైలు, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రణాళికతో నగరంలో స్కైవేలు ఇవన్నీ ఇందులో భాగమేనని చెప్పారు.

తెలంగాణ ఏరోస్పేస్ హబ్‌గా మారిందని అన్నారు. ప్రఖ్యాత విమానకంపెనీ బోయింగ్, దేశీయ దిగ్గజం టాటాతో జట్టుకట్టి ఏర్పాటు చేయనున్న అపాచీ హెలీకాప్టర్ల తయారీ కేంద్రానికి హైదరాబాద్‌ను ఎన్నుకోవడం సర్కారు సమర్థ పరిపాలనకు నిదర్శనమని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపయోగిస్తున్న హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్‌లోనే తయారయిందని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

విద్యుత్ కోతలతో తమ కంపెనీలు మూతపడుతున్నాయని వాపోతూ రెండేళ్ల క్రితం రిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా నిర్వహించారని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలాంటి పరిస్థితులు లేనేలేవన్నారు. విద్యుత్ సరఫరా నష్టాలను పూడ్చడంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన చర్యలు ఇందుకు దోహదం చేశాయని తెలిపారు.

2019 నాటికి 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని మేం ముందుకు సాగుతున్నామని తెలిపారు. కృష్ణా-గోదావరి నదులకు చెందిన ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకుని రాబోయే నాలుగేండ్లలో 75వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులను నిర్మించనున్నామని చెప్పారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు, వృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

ప్రజాసంక్షేమం కోసం తమ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలు మౌలిక రంగానికి బాసటగా నిలుస్తున్నాయని చెప్పారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

విద్య, వైద్యం, ఏరోస్పేస్, డిజిటల్, అగ్రికల్చర్, రోడ్లు-భవనాలు, ఆతిథ్యరంగం.. ఇలా అన్ని రంగాల్లోనూ మౌలిక సదుపాయల కంపెనీలకు పెద్దఎత్తున అవకాశాలున్నాయని తెలిపారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌డెక్కన్‌లో తెలంగాణలో మౌలిక సదుపాయాల రంగం-వృద్ధి అనే అంశంపై జరిగిన సెమినార్‌కు మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

తెలంగాణలో ఈ రెండు అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే అందులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

హైదరాబాద్‌కు వన్నెతెస్తూ అంతర్జాతీయంగా పేరు సాధిస్తున్న జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో పూర్తికావస్తున్న ఎల్‌ఆండ్‌టీ మెట్రో రైలు, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రణాళికతో నగరంలో స్కైవేలు ఇవన్నీ ఇందులో భాగమేనని చెప్పారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

ఇంతేకాకుండా మెట్రో రెండో దశలో నగరంలో 200 కిలోమీటర్లను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

1,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు, ప్రతి మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంతో అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం కోసం బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 25ఏళ్లలో చైనా అభివృద్ధి చెందిన తీరును స్పూర్తిగా తీసుకొని రాష్ర్టాన్ని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు.

English summary
The TRS government’s main focus is the welfare and development of the people of Telangana state, information technology, panchayat raj minister minister KT Rama Rao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X