Weather Update: ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలు..
రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించినా.. వర్షాలు అనుకున్న స్థాయిలో కురవడం లేదు. పైగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతోన్నాయి. చాలా చోట్ల ప్రజలు ఉక్కపోతతో బాధపడుతున్నారు. ఉదయం కాస్త చల్లగా ఉండి.. మధ్యాహ్నం వరకు ఉక్కుపోత ఎక్కువ అవుతోంది. సాయంత్రం వాతావరణం చల్లబడిన ఇళ్లలో ఉండే వారు మాత్రం ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడ వానలు పడినా.. వాతావరణం మాత్రం కూల్ గా మారడం లేదు. అయితే పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని.. వీటి వల్ల వాతావరణం చల్లబడుతుందని చెబుతున్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వానలు కురిసాయి. బుధవారం 17 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయింది. మంచిర్యాల జిల్లా భీమారంలో అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. సూర్యాపేట జిల్లాలో 41.2, జగిత్యాల జిల్లాలో 41.1, భద్రాద్రి కొత్తగూడెంలో 41.1, ములుగులో 41.1, పెద్దపల్లిలో 41, నల్గొండలో 40.9, కరీంనగర్ లో 40.8, మహబూబాబాద్‌లో 40.8, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 40.7, వరంగల్‌లో 40.6 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు అయింది. యాదాద్రి భువనగరిలో 40.6, ఖమ్మంలో 40.5, జయశంకర్ భూపాలపల్లిలో 40.3, నిర్మల్‌లో 40.2, నిజామాబాద్‌లో 40, జనగామలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

హైదరాబాద్ లో మాత్రం వాతావరణం కాస్త కూల్ గానే ఉంది. బుధవారం ఖమ్మం జిల్లా వేంసూరులో 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి 30 మిల్లీమీటర్లు, సూర్యాపేట జిల్లా మునగాలలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అయితే వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 21, 22 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండో జర్మన్ నిపుణులు తెలిపారు.
పలు జిల్లాల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం 12 జిల్లాలు, శుక్రవారం 14, శనివారం 5, ఆదివారం 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ ఇచ్చింది. చాలా ప్రాంతాల్లో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురవకపోవడంతో పోచమ్మ బోనాలు, కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు.












Click it and Unblock the Notifications