ఆపరేషన్ సిందూర్ కు తాత్కాలిక బ్రేక్ మాత్రమే.. కేంద్రమంత్రి సంచలనం

ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదని, ఉగ్రవాదుల పైనే తమ పోరాటమని, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. భారతదేశం చేస్తున్న పోరాటం పాకిస్తాన్ ఆర్మీ పైన కాదని ఉగ్రవాదులపైనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం: కిషన్ రెడ్డి
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం నేర్పినట్లు కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దిక్కు తోచని పరిస్ధితుల్లో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తాత్కాలికంగానే ఆగినట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ తో
భారత సైన్యం ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో కొత్త చరిత్రను లిఖించాయని అన్నారు.

Temporary break for Operation Sindoor Union Minister kishan reddy sensation

Take a Poll

దాదాపు వంద మంది ఉగ్రవాదుల అంతం
పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదులు పహల్గాం లో 26 మందిని బలి తీసుకోవటంతో ప్రతీకారంగా, 9 ఉగ్రవాద స్ధావరాలను పాకిస్తాన్ సైన్య మౌలిక సదుపాయాలను ద్వంసం చేసినట్లు పేర్కొన్నారు. వీరులైన భారత సైనికులు ప్రపంచం నివ్వెరపోయెలా, నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకుని, దాదాపు వంద మంది ఉగ్రవాదులను అంతం చేసినట్లూ, 11 వైమానిక స్ధావరాలను అసాధారణ రీతిలో నాశనం చేసినట్లు మంత్రి చెప్పారు.

నేడు ప్రపంచం భారత్ వైపు చూస్తోంది
రక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచినట్లు చెబుతూ, రక్షణ రంగంలో గత పదేళ్ళుగా చేపట్టిన చర్యల ఫలితాలు నేడు ప్రపంచం చూస్తోందనీ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 35 శాతం రక్షణ రంగ సరఫరాలు దేశీయంగానే తయారవుతున్నాయని మంత్రి చెప్పారు. సైనిక పాటవాన్ని అభినందించేందుకు సైనికులకు సంఘీభావం ప్రకిటించేందుకు చేపట్టిన రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న తిరంగా యాత్ర లో పాల్గొనాల్సిందిగా మంత్రి కోరారు.

రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర
ప్రజా ప్రతినిధులందరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలాని ఆయన కోరారు. రక్షణ సలహాదారు సతీష్ రెడ్డి, మాజీ DGP అరవింద కుమార్, ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, జయప్రద, మంగ్లీ, వందేమాతరం శ్రీనివాస్, కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, బండి సంజయ్ కుమార్ సహా పాలువురు ప్రముఖులు పాల్గోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+