వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసి ఆత్మ‌గౌర‌వ భ‌వనాల‌కు టెండ‌ర్లు.!ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌లో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఆదేశాలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బిసి సంక్షేమ శాఖ అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు, ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల నిర్మాణాల్ని త‌క్ష‌ణ‌మే పూర్తి చేయ‌డం కోసం బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఖైరతాబాద్లోని త‌న కార్యాల‌యంలో మ‌రో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో క‌లిసి ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. హైద‌రాబాద్ లోని అత్యంత ఖ‌రీదైన కోకాపేటలో, ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లోని బిసి ఆత్మ‌ గౌర‌వ భ‌వ‌నాల‌ కోసం ప్ర‌భుత్వం కేటాయించిన స్థ‌లాలు బిసి సంక్షేమ శాఖకు స్వాదీన‌మైన నేప‌థ్యంలో బిసిల్లోని ఉప‌కులాల‌కు ఆత్మ‌గౌర‌వ భ‌వ‌న నిర్మాణాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని మంత్రి ఉన్న‌తాదికారుల‌ను ఆదేశించారు.

బిసిల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం.. ఎన్ని నిధులైనా ఖ‌ర్చుచేయ‌డానికి సీఎం సిద్దమన్న గంగుల..

బిసిల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం.. ఎన్ని నిధులైనా ఖ‌ర్చుచేయ‌డానికి సీఎం సిద్దమన్న గంగుల..

నాణ్య‌త‌తో కూడిన ప్ర‌పంచ స్థాయి శాశ్వ‌త భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు టెండ‌ర్ల‌ను త‌క్ష‌ణ‌మే ఆహ్వ‌నించాల్సిందిగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఆదేశించారు. ఇప్ప‌టికే కోకాపేట్లో హెచ్ఎండిఏ మౌళిక వ‌స‌తుల్ని డెవ‌ల‌ప్ చేసింద‌ని, ఉప్ప‌ల్ బ‌గాయ‌త్లో సైతం మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ గారిని మంత్రి గంగుల ఆదేశించారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి చంద్రవేఖర్ రావు బిసిల సంక్షేమం కోసం క‌ట్టుబ‌డి ఉన్నార‌ని, అందుకోసం ఎన్ని నిధులు అవ‌స‌ర‌మైతే అన్ని నిదులు ఉపయోగించుకునే అవకాశం కల్పించారని మంత్రి తెలిపారు.

బీసీల అభివృద్ది కోసం యాక్షన్ ప్లాన్.. ప్ర‌తీ బిసి బిడ్డ ల‌బ్దిపొందాలన్న మంత్రి కమలాకర్..

బీసీల అభివృద్ది కోసం యాక్షన్ ప్లాన్.. ప్ర‌తీ బిసి బిడ్డ ల‌బ్దిపొందాలన్న మంత్రి కమలాకర్..

ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని రాష్ట్రంలోని ప్ర‌తీ బిసి బిడ్డ‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చే విదంగా యాక్ష‌న్ ప్లాన్ రూపొందించాల‌ని అధికారుల‌ను మంత్రి గంగుల‌ కమలాకర్ ఆదేశించారు. త్వ‌ర‌లోనే సమ‌గ్ర ప్ర‌ణాళిక‌ల‌తో సీఎం చంద్రశేఖర్ రావును క‌లుస్తామ‌ని వెల్ల‌డించారు మంత్రి గంగుల‌. ఈ సంద‌ర్భంగా బిసి సంక్షేమ శాఖ ప‌రిదిలోని అన్ని కార్పోరేష‌న్ల‌లో అమ‌ల‌వుతున్న ఆర్థిక స‌హాయ, ప‌థ‌కాలు, ఇత‌ర ప‌థ‌కాల గురించి గంగుల స‌మ‌గ్రంగా స‌మీక్షించారు. తాజాగా ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోయే ర‌జ‌కులు, నాయీ బ్రాహ్మ‌ణుల‌కు 250 యూనిట్ల ఉచిత క‌రెంటుతో పాటు, బిసి నిరుద్యోగ యువ‌కుల కోసం 25 ల‌క్ష‌ల వ్యయంతో ఇవ్వ‌ త‌ల‌పెట్టిన అత్యున్న‌త స్థాయి అంబులెన్స్ ల ప‌థ‌కం, ఇంకా ఇత‌ర ప‌థ‌కాల‌పై లోతుగా చ‌ర్చించారు మంత్రి గంగుల.

గౌడ సోద‌రుల‌కు మోపెడ్లు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తికి గంగుల సానుకూల స్పందన..

గౌడ సోద‌రుల‌కు మోపెడ్లు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తికి గంగుల సానుకూల స్పందన..

బిసిల్లోని నిజమైన లబ్ది దారులను గుర్తించి వారికి స‌మ‌గ్రంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేరేవిదంగా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని, బిసిల స‌ర్వ‌తోముఖాబివ్రుద్దికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, గౌడ కార్మికుల‌కు మోపెడ్లు అందించాల‌ని, గౌడ సొసైటీల్లోని అర్హులైన ప్ర‌తీ ఒక్క‌రికి స‌హాయం చేయాల‌ని మంత్రి గంగులకు విజ్ణ‌ప్తి చేసారు మరో మంత్రి శ్రీనివాస గౌడ్. మంత్రి ప్రతిపాదనకు గంగుల వెంట‌నే సానుకూలంగా స్పందించి గౌడ కుల‌స్థుల‌కు మోపెడ్లు అందించ‌డంతో పాటు పూస‌ల‌, మేద‌ర కుల‌స్థుల‌కోసం అందిస్తున్న పూస‌ల బండ్ల ప‌థ‌కం గురించి సైతం అధికారుల‌కు ఆదేశాలు జారి చేశారు.

Recommended Video

Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !
బిసిల అభివ్రుద్దిపై స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌.. త్వ‌ర‌లోనే సీఎంతో బేటీ కానున్న మంత్రి గంగుల

బిసిల అభివ్రుద్దిపై స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌.. త్వ‌ర‌లోనే సీఎంతో బేటీ కానున్న మంత్రి గంగుల

దేశంలో ఏ రాష్ట్రం నిర్వ‌హించ‌న‌ట్టుగా బిసి సంక్షేమాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్ర‌భుత్వం చేస్తుంద‌ని, ప్ర‌పంచ‌స్థాయి నాణ్య‌త‌తో బిసి గురుకులాల్లో విద్యాబోద‌న అందిస్తుంద‌ని, బిసి స్ట‌డీ స‌ర్కిళ్ల ద్వారా బిసి విద్యార్థుల‌కు ఉద్యోగాల కోసం క్రుషి చేస్తున్న విష‌యాన్ని మంత్రి గంగుల గుర్తుచేశారు. ఇదిలా బీసి ఆత్మగౌరవ భవనాల టెడర్లను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎటువంటి అవకతవకలకు ఆస్కరం లేకుండా నిర్వహించబోతున్నట్టు గంగుల తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిసి సంక్షేమ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, బిసి సంక్షేమ శాఖ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

English summary
Programs implemented by the BC Welfare Department,BC Welfare Minister Gangula Kamlakar conducted a high-level review with another minister, Srinivas Gowd, at his office in Khairatabad for the immediate completion of the construction of the BC self-respecting buildings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X