మరో హామీ అమలుకు సిద్దం- మహిళల ఖాతాల్లో రూ లక్ష..!!

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధానమైన అయిదు హామీలను అమలు ప్రారంభించింది. ఇతర హామీల అమలు పైన ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. అందులో భాగంగా ఆడపిల్లకు కల్యాణ లక్ష్మి స్కీమ్ లో భాగంగా లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం కానుకగా ఇస్తామని చెప్పిన హామీ పైన దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను గుర్తించి వారి ఖాతాల్లో రూ లక్ష జమ చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

కళ్యాణ లక్ష్మీ పథకం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీ పథకం కింద అర్హులకు రూ లక్ష వరకు అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో పాటుగా పది గ్రాముల బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పుటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. మూడు విడతల్లో రెండు లక్షల వరకు రుణమాపీ అమలు చేసారు. దీంతో, ఇతర పథకాల పైన ఇప్పుడు ఫోకస్ చేసారు.

TG Govt begin Exercise on implementation of Kalyana Lakshmi Scheme

కసరత్తు
అందులో భాగంగా కల్యాణలక్ష్మీ పథకం కోసం అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను సేకరించింది. అసెంబ్లీలో తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనూ ప్రభుత్వం ఈ పథకం కోసం రూ 2,175 కోట్లు ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కల్యాణ లక్ష్మి పథకం కోసం 65,026 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 33,558 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అర్హతను పరిశీలించి తిరస్కరణకు గురైనవి కాకుండా..24,038 దరఖాస్తులకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు.

నిధుల జమ
వీటితో పాటుగా అర్హత పొంది నిధులు లేక పెండింగ్ లో ఉన్న లబ్దిదారులకు నిధులను మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం రుణమాఫీ పూర్తయిన తరువాత ఈ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రభుత్వం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలకు ఎదురు చూస్తున్న పథకం నెలకు రూ 2,500 నగదు. ప్రభుత్వం ఈ పథకం పైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వచ్చే ఆర్దిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ పథకం అమలు చేస్తారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+