విద్యార్ధులకు గుడ్ న్యూస్ - పెండింగ్ స్కాలర్‌షిప్ నిధుల విడుదల..!!

తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. చర్చనీయాంశంగా మారిన స్కాలర్ షిప్ పెండింగ్ బకాయిల సమస్యను పరిష్కరించింది. నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. హామీ ఇచ్చినట్టుగానే నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సి ఉన్న పెండింగ్ స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 2,813 జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల లకు సంబంధించిన రూ.161 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖకు సూచించారు.

TG Govt decided to release 161 crore dues pending with regard to Scholarships

ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖతో జరిగిన సమీక్షలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు స్కాలర్‌షిప్ పేరుతో బకాయిలుగా రూ.161 కోట్లు ఉన్నట్టు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఆర్థికభారం పడకుండా ప్రభుత్వం త్వరిత గతిన చర్యలు తీసుకుంటున్నట్టు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ మేరకు నిధుల విడుదల పైన మార్గదర్శకాలు ఖరారు చేసారు.

తెలంగాణలో కొంత కాలంగా స్కాలర్‌షిప్ బకాయిల విడుదల కోసం కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చేసాయి. కాలేజీలను బంద్ చేస్తూ.. ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించాయి. ఆ సమయం లో ప్రభుత్వం చేపట్టిన చర్చల్లో బాగంగా బకాయిలను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఇప్పుడు నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థలో అవసరమైన మార్పులపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయివేటు కాలేజీ లకు కొంత మేర వెసులుబాటు కలగనుంది. అదే విధంగా విద్య సంస్కరణల దిశగానూ ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+