ఉచిత క్యాన్సర్ పరీక్షలు, ఇవి ప్రత్యేకంగా- నిర్ధారణ అయితే.. మార్గదర్శకాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. క్యాన్సర్ కేసులు పెరుగుతున్న వేళ ముందస్తు చర్యల పైన అప్రమత్తం అయింది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత క్యాన్సర్ పరీక్ష లు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను ఖరారు చేసిం ది. మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ స్క్రీనింగ్ తో పాటుగా మగవారిలో నోటి క్యాన్సర్‌ పరీక్షలు చేయనున్నారు. రాష్ట్రంలో పది క్యాన్సర్‌ ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటుకు తాజా గా నిర్ణయించారు.

ఉచిత పరీక్షలు
తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. తాజా అధ్యయ నాల్లో చాలా మందిలో క్యాన్సర్‌ లక్షణాలు కనిపించకుండా.. బాగా ముదిరి, చివరి దశకు చేరుకు న్నాక నిర్ధారణ అవుతున్నట్లు గుర్తించారు. ఆ సమయంలో చికిత్స చేసినా.. చాలా వరకు ఉపయో గం లేకుండా పోతోంది. ఇక, ఆరోగ్యశ్రీ కేసుల్లోనూ క్యాన్సర్‌ చికిత్సలు సింహభాగం ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే.. రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కేసుల్లో ఓరల్‌, రొమ్ము, గర్భాశ య ముఖద్వార క్యాన్సర్‌ రోగులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ మూడు కేటగిరీలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించాలని నిర్ణయించింది.

tg-govt-latest-decision-on-free-cancer-screening-tests-details-here

ప్రత్యేక కేంద్రాల ఏర్పాట్లు
క్యాన్సర్‌ పరీక్షల కోసం ప్రభుత్వం పది ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ప్రాంతీయ కేంద్రాలను రెండు దశల్లో ప్రారంభించనుంది. మొదటి దశలో భద్రాద్రి-కొత్తగూడెం, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో ఒక్కోచోట రూ.50 కోట్ల చొప్పున వెచ్చించి, ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. తదుపరి దశలో మరో ఐదు చోట్ల ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కేంద్రాల్లో క్యాన్సర్‌కు మెడికల్‌, సర్జికల్‌, రేడియో థెరపీ సేవలు అందించను న్నారు. దీంతోపాటు.. అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఇక్కడ కీమోథెరపీ, పాలియేటివ్‌ కేర్‌ సేవలందిస్తారు. దీంతోపాటు.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మొబైల్‌ వాహనం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వాహనంలో ఆంకాలజిస్టులు, పారామెడికల్‌ సిబ్బంది ఉంటారు.

Take a Poll

ప్రతీ గ్రామంలో
మొబైల్‌ వాహనాలు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాయి. ముందుగానే నిర్ణీత గ్రామంలో క్యాన్సర్‌ స్క్రీనింగ్ పరీక్షల తేదీలను ప్రకటిస్తారు. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షల్లో ఎవరిలో అయినా క్యాన్సర్‌ లక్షణాలు బయటపడితే.. జిల్లాస్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రానికి తరలిస్తారు. సర్జరీలు అవసరమైతే ప్రాంతీయ కేంద్రాలకు.. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రికి సిఫారసు చేస్తారు. వీటితోపాటు.. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఒక క్యాన్సర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. ఉచితంగా స్క్రీనింగ్ నిర్వహించనున్నారు.
మొబైల్‌ వాహనం ద్వారా రోజుకు కనీసం 200 మందికి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+