చిరంజీవి, బన్నీ మామ కాంగ్రెస్ నేతలే - కానీ, జరిగిందిదీ..!!
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ పైన చర్చ జరిగింది. హైకోర్టు బెయిల్ ఇవ్వటంతో ఈ ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను పరామర్శించారు. కాగా, అల్లు అర్జున్ అరెస్ట్ పైన మంత్రులు స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సమయంలో మంత్రులు క్లారిటీ ఇచ్చారు.
అల్లు అర్జున్ అరెస్ట్ పైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్పందించాయి. అరెస్ట్ ను తప్పు బట్టాయి. కాగా, సీఎం రేవంత్ సైతం ఈ ఎపిసోడ్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. మహిళ ప్రాణం పోతే కేసులు పెట్టకూడదా అని ప్రశ్నించారు. ఇందులో తమ ప్రమేయం లేదని.. చట్టం తన పని తాను చేసుకు పోతోందని చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సంధ్యా ధియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ చనిపోయినప్పుడు మాట్లాడని కేటీఆర్‌కు ఇప్పుడు మాట్లాడే అర్హత లేదని చెప్పారు. సినిమా వాళ్లు, అల్లు అర్జున్‌పై తమ ప్రభుత్వానికి ఎందుకు కోపం ఉంటుందని అన్నారు. కోపం ఉంటే దిల్ రాజును తాము ఎందుకు చైర్మన్ చేస్తామని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అధికారంతో పాటు విచక్షణ కోల్పోయిందని పొన్నం ధ్వజమెత్తారు. అందుకే ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తుందని ఆగ్రహించారు. బీఆర్ఎస్ నేతలకు చట్టం పట్ల అవగాహన ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మరో మంత్రి సీతక్క అల్లు అర్జున్ అరెస్ట్ పైన స్పందించారు. అల్లు అర్జున్‌పై తమకేమి కక్ష లేదని, ఆయన అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందని చెప్పారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని స్పష్టం చేశారు. చిరంజీవి, అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులేనని తెలిపారు. అయినా పోలీసులు చట్ట ప్రకారం వ్యవహారించారని అన్నారు.












Click it and Unblock the Notifications