ఐలయ్యా! మా ఆడపడుచులు వస్తారు: టీజీ గట్టి కౌంటర్, కాళ్లు విరగ్గొట్టండి: మాగంటి

వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ శుక్రవారం ఘాటు కౌంటర్ ఇచ్చారు.

Recommended Video

    TDP MP TG Venkatesh And Maganti Babu Warned Writer Kancha Ilaiah | Oneindia Telugu

    హైదరాబాద్/అమరావతి: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ శుక్రవారం ఘాటు కౌంటర్ ఇచ్చారు.

    కారుకూతలు మానేయకుంటే

    కారుకూతలు మానేయకుంటే

    మన మీద, మన వ్యవస్థ మీద, మన కుటుంబం మీద కారుకూతలు కూయడం మానుకుంటే కంచ ఐలయ్యకు సన్మానం చేస్తామని టీజీ వెంకటేష్ అన్నారు. అంతేకాదు, ఆయనకు బాసటగా నిలుస్తామని చెప్పారు.

     మా ఆడపడుచులు బయటకొస్తారు

    మా ఆడపడుచులు బయటకొస్తారు

    కంచ ఐలయ్య కారుకూతలు మానకుంటే మాత్రం ఇక మా ఆడపడుచులు బయటకు వస్తారని టీజీ హెచ్చరించారు. వారే మీకు సరైన సమాధానం చెబుతారన్నారు. మీకు బతికి ఉండగానే వారు తర్పణాలు పెడతారన్నారు. మీకు సమాధానం చెప్పేందుకు మా ఆడపడుచులు బయటకొస్తారన్నారు.

    పొరపాటు అని చెబితే

    పొరపాటు అని చెబితే

    తాను పొరపాటుగా ఆ పుస్తకాన్ని రాశానని చెప్పి, ఆ రాతలను వెనక్కు తీసుకుంటే ఆయన ఇంటికి వెళ్లి సన్మానిస్తామని టీజీ వెంకటేష్ అన్నారు. ఈ విషయంలో ఇంకా రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే వైశ్యులు సహించరన్నారు. ఐలయ్య అసలైన స్మగ్లర్ అన్నారు.

    పుస్తకాలు రాసి బ్లాక్ మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్ ఐలయ్య

    పుస్తకాలు రాసి బ్లాక్ మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్ ఐలయ్య

    కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా పుస్తకాలు రాసి వాటిని బ్లాక్ మార్కెట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఐలయ్యే అసలైన స్మగ్లర్ అని టీజీ ధ్వజమెత్తారు. కులమతాల మధ్య చిచ్చుపెడుతూ రాతలు రాసేవారిని ఉరితీసే విధంగా చట్టాలు చేయాలన్నారు.

    కాళ్లు విరగ్గొట్టాలని మాగంటి బాబు

    కాళ్లు విరగ్గొట్టాలని మాగంటి బాబు

    కోమట్లకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కాళ్లు విరగ్గొట్టాలని టిడిపి నేత మాగంటి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమట్లు మంచికి, మానవత్వానికి పేరుగాంచిన వాళ్లు అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+